'గుంటూరు కారం' సన్సేషనల్ రికార్డ్
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పనితీరుతో, హీరో మహేష్ బాబు యాటిట్యూడ్ తో ఓ అట్టర్ ఫ్లాప్ సినిమా గుంటూరు కారంను హారిక హాసిని క్రియేషన్స్ తెలుగు ప్రేక్షకులకు అందించింది. నిర్మాత బ్యాడ్ లక్ అనుకోవడమేకానీ మనం మాత్రం చేయగలిగింది ఏం ఉంది?. సినిమా ఎప్పుడు విడుదలైనా దాని టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు సాధించడం అనేది మాత్రం మహేష్ సినిమాకే సాధ్యం అనుకోవాలి. ఇది వాస్తవమని కూడా చెప్పొచ్చు.
గుంటూరు కారం చిత్రం మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.94.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. తొలి రెండురోజుల్లోనే యూఎస్ మార్కెట్ లో రెండు మిలియన్ డాలర్ల మార్క్ ను క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. మహేష్ బాబు గత సినిమాలు సరిలేరు నీకెవ్వరు, సర్కారువారి పాట, శ్రీమంతుడు, భరత్ అను నేను చిత్రాలు కూడా రెండు మిలియన్ డాలర్ల మార్క్ ను టచ్ చేశాయి. ఓవర్సీస్ లో ఏ హీరోకు లేనటువంటి మార్కెట్ మహేష్ బాబుకు ఉందని చెప్పవచ్చు.

ఫ్యాన్ బేస్ చాలా పటిష్టంగా ఉంది. సినిమా హిట్టా? ఫ్లాపా? అనేదాంతో సంబంధం లేకుండా స్టడీగా కలెక్షన్లు రాబట్టడం మహేష్ బాబు సినిమాలకు సర్వసాధారణంగా మారిపోయింది. వీకెండ్ తోపాటు పండగ సెలవులు ముగిసిన తర్వాత లాంగ్ రన్ ఈ సినిమాకు ఉంటుందా? అంటే సందేహమే అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఈ మూడురోజుల్లో సినిమా ఎంత సాధిస్తుందనేదానిపై గుంటూరు కారం బ్రేక్ ఈవెన్ అవుతుందా? లేదా? అనేది ఆధారపడివుంది. 12వ తేదీన విడుదలైన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.131 కోట్ల షేర్ సాధించాల్సి ఉంది. ప్రస్తుతం రెండురోజులకు రూ.62.55 కోట్ల షేర్ రాబట్టింది. ఇంకా రూ.68.45 కోట్లను రాబట్టాల్సి ఉంది.












Click it and Unblock the Notifications