మహేశ్ బాబు ఉదారత: మరో కీలక నిర్ణయం
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పటికే పలు కార్యక్రమాలతో సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. మహేశ్ బాబు ఫౌండేషన్ (Mahesh Babu Foundation)ను స్థాపించి ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లకు సాయం అందిస్తున్నారు. పలు గ్రామాలను అభివృద్ధి కోసం కూడా సాయం చేశారు. తాజాగా, మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
తన తండ్రి కృష్ణ ప్రథమ వర్ధంతి(నవంబర్ 15) సందర్భంగా పేద విద్యార్థులకు చేయూతనిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మహేశ్ బాబు. 'సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషన్ ఫండ్' పేరుతో సాయం అందించనున్నారు. 40 మందికిపైగా పేద విద్యార్థులను ఎంపిక చేసి ఈ స్కాలర్ షిప్ అందించనున్నారు. పాఠశాల చదువు నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉపకార వేతనం (స్కాలర్ షిప్) ఇవ్వనున్నారు.

2020లో తన సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి మహేశ్ బాబు.. 'మహేశ్ బాబు ఫౌండేషన్'ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సుమారు 2500 మందికిపైగా చిన్నారులకు గుండెకు సంబంధించిన ఆపరేషన్లకు సాయం అందించారు. కృష్ణ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెంలో ఓ పాఠశాలను నిర్మించారు. పలు ఇతర సేవా కార్యక్రమాలను ఆయన కొనసాగిస్తున్నారు.
మహేశ్ బాబు తాజాగా తీసుకున్న నిర్ణయంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోలా మిగితా సినీ నటులు కూడా ఎంతో కొంత సమాజానికి సేవ చేసేందుకు ముందుకు రావాలని కోరుతూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కాగా, 'ఎప్పటికీ సూపర్ స్టార్' అంటూ కృష్ణ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు మహేశ్ బాబు.
ఇక, మహేశ్ ప్రస్తుత సినిమాల విషయానికొస్తే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న 'గుంటూరు కారం' చిత్రంలో నటిస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2024 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications