మహేష్ బాబు మొబైల్ వాల్ పేపర్ ఫొటో ఏంటో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు , భరత్ అనే నేను, మహర్షి వంటి సూపర్ హిట్లతో ఆగ్ర స్థానానికి చేరువయ్యారాయన. సంక్రాంతికి మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది.

ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబుకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. మహేష్ బాబు పెద్దగా ఫోన్ క్యారీ చేయరనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మహేష్ బాబు సైతం పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. మహేష్ బాబు ఫోన్‌ను ఆమె భార్య నమ్రత మెయిన్‌టైన్ చేస్తారు. అయితే మహేష్ బాబు ఫోన్ వాల్ పేపర్ ఏం పెట్టుకున్నారా అని అంతా అతృుతగా వెతుకుతున్నారు. మహేష్ బాబు కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఆయన మొబైల్ వాల్ పేపర్‌గా ఫ్యామిలీ ఫొటో లేదా పిల్లలు సితార, గౌతమ్‌ల ఫొటో ఉంటుందని అంతా భావించారు. వీరి ఫొటోలు కాకపోతే నమ్రత లేదంటే ఆయన ఆరాధించే తండ్రి కృష్ణ ఫొటో ఉంటుందని అనుకుంటున్నారు.

Mahesh Babu mobile wallpaper photo leaked

కానీ అందరికి షాకిస్తూ.. మహేష్ బాబు మొబైల్ వాల్ పేపర్‌గా ఎర్త్ ఫోటో పెట్టుకున్నారు. సదరు గ్లోబ్ ఫొటోలో భారత్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. మహేష్ బాబు ఎర్త్ ఫొటోను తన వాల్ పేపర్‌గా పెట్టుకోవడం వెనుక కారణం మాత్రం తెలియడం లేదు. మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారు. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు తన లుక్‌ను మొత్తం మార్చేశారు. గెడ్డం, జుట్టు ఫుల్‌గా పెంచేసి కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక మహేష్ బాబు చేసే సామాజిక సేవలు గురించి ఎంత చెప్పుకున్న తక్కవే. మరే ఇతర హీరోకు సాధ్యం కాని విధంగా మహేష్ బాబు సేవలందిస్తున్నారు. తెలంగాణలో ఓ గ్రామాన్ని, ఆంధ్రలో మరో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ది చేస్తున్నారు మహేష్ బాబు. ముఖ్యంగా చిన్న పిల్లల్ని కాపాడే విషయంలో మహేష్ బాబు ముందుంటారు. అందులో మెయిన్‌గా చెప్పుకోవాల్సింది చిన్న పిల్లల గుండె ఆపరేషన్ల గురించే. ఇప్పటి వరకు వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయించారు మహేష్ బాబు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+