Athadu 4K Re- Realease: రచ్చ..! రచ్చస్య..! రచ్చోభ్యహ..!
ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు 50 వ పుట్టిన రోజు సందర్భంగా 'అతడు' సినిమాను 4K వెర్షన్ లో రీ-రిలీజ్ చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. అటు సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసిన ఈ మూవీకి సంబంధించిన వీడియోలు, ఫ్యాన్ సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక అతడు రీ రిలీజ్ లో భాగంగా థియేటర్లలో అభిమానులు సందడికి హద్దే లేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Monnati daka antha hawa ledu kani ninnati nundi Insta antha Athadufied ayyipoyyindi #Athadu pic.twitter.com/mIjsPdHjKw
— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) August 8, 2025
అతడు సినిమాలోని పిల్లగాలి అల్లరి అనే సాంగ్ కి ఒక మహిళా అభిమాని డ్యాన్స్ చేస్తున్న వీడియో కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అచ్చం త్రిష లానే లంగా వోణీ ధరించి థియేటర్లో పాటకు స్టెప్పులేసింది ఈ మహిళ. ఆమె డాన్స్ చేస్తుంటే థియేటర్లోని ఆడియన్స్ అంతా విజిల్స్, కేకలు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో చూసిన వారంతా ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబుకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఈ వీడియోతో అది మరోసారి క్లారిటీగా తెలిసిపోతోంది.
Fan Girl ❤️🔥
— Addicted To Memes (@Addictedtomemez) August 9, 2025
With Same Costume
Babu Fan Girls Things 😁🫶#MaheshBabu𓃵 #Athadu4K #HBDSuperstarMahesh #Athadu pic.twitter.com/0pgV5x4lm5
ఇక అతడు రీ- రిలీజ్ ను ఫ్యాన్స్ ఓ పండగలా చేసుకుంటున్నారు. హైదరాబాద్ లోని థియేటర్లు ఉదయం 7 గంటల నుంచే షోలు వేయడం స్టార్ట్ చేశాయి. దీంతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. సినిమాలోని సీన్లు, డైలాగులను రీక్రియేట్ చేస్తూ థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు మహేష్ బాబు కెరియర్ లోనే అత్యధిక సార్లు టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన సినిమాగా అతడు నిలిచింది.

ఇక దర్శకధీరుడు రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న SSMB29 నుంచి అప్డేట్ రానే వచ్చింది. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు రాజమౌళి. నవంబర్ లో మూవీని రివీల్ చేస్తామని ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ మేరకు మహేశ్ బాబు పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ లో మహేష్ మెడ భాగం మాత్రమే కనిపిస్తోంది. మెడలో రుద్రాక్ష, చుట్టూ రక్తంతో లుక్ ఆసక్తిగా ఉంది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
దయచేసి నన్ను సినిమాల్లో పెట్టుకోండి: రాజశేఖర్ రిక్వెస్ట్ -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" -
'బైకర్' ట్రైలర్ రిలీజ్.. శర్వానంద్ ఈసారి హిట్ కొట్టేశాడోచ్..! -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
తెలంగాణ గద్దర్ అవార్డుల్లో చిన్న సినిమా హవా! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications