50 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా.. సూప‌ర్ స్టార్ ఫిట్ నెస్, బ్యూటీ సీక్రెట్ తెలిసిపోయింది..!

సూపర్ స్టార్ మహేశ్ బాబు మరో రెండు నెలల్లో 50వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఆయన్ను చూస్తే 50 ఏళ్ల వ్యక్తిలా అసలు కనిపించరు. పాతికేళ్ల కుర్రాడిలా ఉంటారు. సర్కారు వారి పాట, గుంటూరు కారం సినిమాల్లో మహేశ్ ఫిట్ నెస్, బ్యూటీ స్పష్టంగా కనిపిస్తుంది. 50 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లకు ఏమాత్రం తగ్గకుండా ఆయన హెల్త్ ను మెయింటెన్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ఆయన ఫిట్ నెస్ సీక్రెట్ ఇదేనని సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్ అవుతోంది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఏం తింటారు..? ఆయన ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటి..? బ్యూటీ సీక్రెట్ ఏంటి..? ఈ ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలని చాలామంది ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. అటు ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా ఆయన ఫిట్ నెస్, బ్యూటీ సీక్రెట్ ఏంటన్నది తెలుసుకోవాలని ఉంటుంది. గత పాతికేళ్లుగా ఆయన ఒకేలా ఉండటం విశేషం. మరి సూప‌ర్ స్టార్ ఫిట్ నెస్, బ్యూటీ సీక్రెట్ రన్నింగ్ అట. అవును రోజుకు రెండు నుంచి నాలుగు గంటల పాటు ఆయన రన్నింగ్ చేస్తారట. ఈ విషయాన్ని మహేశ్ మేకప్ మెన్ పట్టాభి చెప్పారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా రోజుకు 2-4 గంటలపాటు రన్నింగ్ చేస్తారట. జిమ్ లోనైనా థ్రెడ్ మిల్ పైనే అధికంగా నడుస్తారట. ఇదే ఆయన ఫిట్ నెస్, బ్యూటీ సీక్రెట్ అని ఆయ‌న మేక‌ప్ మెన్ ప‌ట్టాభి తెలిపారు. సూప‌ర్ స్టార్ కృష్ణ సినిమాలు చేసినంత కాలం ఆయ‌న‌కు మేకప్ మెన్ గా ప‌ట్టాభినే ఉన్నారు. ఆయ‌న తర్వాత మ‌హేష్ కు కూడా తానే మేకప్ మెన్ గా మారారు. మ‌హేష్ థ్రెడ్ మిల్లు మీద వేగంగా రన్నింగ్ చేస్తున్న వీడియోలు చాలా సార్లు నెట్టింట వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఇక డైట్ సీక్రెట్ విషయానికి వస్తే.. ఉప్పు కారం.. మ‌సాల పుడ్ కు దూరంగా ఉంటారట. నీళ్లు ఎక్కువ‌గా తీసుకుంటారట. ఇక నాగార్జున కూడా మంచి ఫిట్ నెస్ మెయింటెన్ చేస్తారు. ఫిట్ నెస్ విషయంలో చిరంజీవికి స్పూర్తి నాగార్జునే. నాగార్జున ఉద‌యాన్నే క్ర‌మం త‌ప్ప‌కుండా జిమ్ చేస్తారు. ఇష్ట‌మైన ఆహారాల‌న్నీ తింటారు. వాట‌ర్ క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవడం నాగ్ బ్యూటీ సీక్రెట్ గా చెబుతారు.

Mahesh Babu s Fitness Mantra Running 2-4 Hours Daily for a Stunning Look

ఇక విశ్వనటుడు కమల్ హాసన్ అయితే రోజుకు 14 కిలోమీట‌ర్లు ర‌న్నింగ్ చేస్తారట. జిమ్ లో వ‌ర్కౌట్లు, యోగా కంటే ర‌న్నింగ్ మ‌రింత మెరుగైన ఫ‌లి తం ఇస్తుంద‌ని క‌మ‌ల్ న‌మ్మ‌కం అని చెబుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+