దైవం మహేష్ రూపేణా..
చాలా మంది రీల్ హీరోలుగానే మిగిలిపోతారు. కానీ కొద్దిమంది మాత్రమే రీల్ తో పాటు రియల్ హీరోలుగా గుర్తుండిపోతారు. అందులో అమ్మాయిల కలల 'రాజకుమారుడు'.. సినీ ఇండస్ట్రీ 'యువరాజు' ఘట్టమనేని వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఈరోజు ఆయన 50వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్నారు.

ఈ మూవీ గ్లోబ్ ట్రోటరింగ్ కథాంశంతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు రాజమౌళి. నవంబర్ లో మూవీని రివీల్ చేస్తామని ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ మేరకు మహేశ్ బాబు పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ లో మహేష్ మెడ భాగం మాత్రమే కనిపిస్తోంది. మెడలో రుద్రాక్ష, చుట్టూ రక్తంతో లుక్ ఆసక్తిగా ఉంది.
అయితే మహేష్ బాబు సినిమాల్లో హీరోగానే కాదు.. బయట తన హ్యుమానిటీని చాటుకుంటూ మానవత్వం ఉన్న ఒక మనిషిగా చాలా గొప్ప కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఇప్పటికే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 వేలకు పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే పలు సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు.

ఆంధ్రా హాస్పిటల్స్ తో భాగస్వామ్యంగా నిరుపేదలకు వైద్యసాయం చేస్తుంటారు మహేష్ బాబు. ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో ఆయన చాలా కేర్ తీసుకుంటారు. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మేమంటే డబ్బున్న వాళ్లం కాబట్టి ఎలాగోలాగా బతికేస్తాం.. కానీ పేద వాళ్ల పరిస్థితి ఏంటి..? అనే ఉద్దేశంతోనే చిన్న పిల్లలకు గుండా ఆపరేషన్లు చేయిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మహేష్ ఇచ్చిన స్ఫూర్తితో చాలా మంది యువ హీరోలు సైతం ప్రజలకు ఎంతో కొంత సేవ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications