పోతారు.. మొత్తం పోతారు..!

సూపర్‌ స్టార్ మహేష్ బాబు- దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో వస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ 'SSMB 29' పై రోజు రోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ మూవీ కోసం అటు ఘట్టమనేని అభిమానులతోపాటు యావత్ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఇక ఇటీవల ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు 50 వ పుట్టిన రోజును ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. బర్త్ డే కానుకగా అతడు సినిమా రీ- రిలీజ్ కావడం ఒకెత్తు అయితే 'SSMB 29'నుంచి అప్డేట్ రావడం మరో విశేషం. దీంతో ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అందినట్లు చెప్పొచ్చు.

ఆగస్టు 9న మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కోసం జక్కన్న అప్డేట్ ఇచ్చారు. మూవీ డెప్త్, పరిధి కారణంగా ఒక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేమని ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను నవంబర్ లో రివీల్ చేస్తామని ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ మేరకు మహేష్ బాబు పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ లో మహేష్ మెడ భాగం మాత్రమే ఉంది. మెడలో రుద్రాక్ష, చుట్టూ రక్తంతో లుక్ ఆసక్తిగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా నుంచి అప్డేట్ నవంబరులో ఇస్తామంటూ ఓ నోట్ పోస్ట్ చేశారు రాజమౌళి. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లోకి వచ్చింది.

Mahesh Babu s Lion Scenes in SSMB29 Karthikeya s Post Ignites Controversy

అయితే తాజాగా రాజమౌళి కుమారుడు కార్తికేయ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో మహేష్ బాబు ల్యాప్ ట్యాప్ లో సింహాన్ని చూస్తూ కనిపించారు. అయితే సింహంతో మహేష్ బాబుకు సీన్స్ భారీగానే ఉంటాయనే హింట్ ఈ పిక్ తో ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలోనూ రాజమౌళి సౌత్ ఆఫ్రికా అడవులకు వెళ్లిన సమయంలో సింహం పిక్స్ ను షేర్ చేసిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+