GlobeTrotter: ఏంటి జక్కన్నా ఇదీ.. ఇలా దొరికిపోయారేంటి..!
సూపర్ స్టార్ మహేష్ బాబు, పాన్ ఇండియా డైరెక్టర్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'SSMB 29'. ఈ మూవీ కోసం తెలుగు రాష్ట్రాలతోపాటు యావత్ సినీ ప్రపంచం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం మూవీ షూటింగ్ సాగుతోంది. అయితే మూవీ ప్రారంభం అయినప్పటినుంచి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు చిత్ర యూనిట్. అసలు మూవీలో క్యాస్టింగ్ ఏంటి.. షూటింగ్ ఎంత వరకు వచ్చింది.. కథేంటి.. ఇలా ఏదీ బయటకు రాకుండా రాజమౌళి టీమ్ జాగ్రత్త పడింది. అయితే ఇవాళ మహేష్ బాబు 50వ పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ కోసం జక్కన్న చిన్న అప్డేట్ ఇచ్చారు.
The First Reveal in November 2025… #GlobeTrotter pic.twitter.com/MEtGBNeqfi
— rajamouli ss (@ssrajamouli) August 9, 2025
దర్శకధీరుడు రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న SSMB29 నుంచి అప్డేట్ వచ్చింది. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు రాజమౌళి. నవంబర్ లో మూవీని రివీల్ చేస్తామని ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ మేరకు మహేష్ బాబు పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ లో మహేష్ మెడ భాగం మాత్రమే ఉంది.

మెడలో రుద్రాక్ష, చుట్టూ రక్తంతో లుక్ ఆసక్తిగా ఉంది. ఇక ఈ సినిమా నుంచి అప్డేట్ నవంబరులో ఇస్తామంటూ ఓ నోట్ పోస్ట్ చేశారు రాజమౌళి. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లోకి వచ్చింది.

అయితే ఇదే లుక్ తో గతం లో పవన్ కల్యాణ్ బ్రో ది అవతార్ చిత్రం ప్రీ లుక్ కూడా వచ్చింది. అది కూడా ఇలాగే నంది, త్రిశూలం బొమ్మలతో తయారు చేసిన దండ లాగా ఉంటుంది. పవన్ కల్యాణ్ కూడా అందులో టీ షర్ట్ ధరించి ఉన్నాడు. దీంతో ఈ పిక్స్ ను సోషల్ మీడియా లో షేర్ చేసి.. పవన్ కల్యాణ్ లుక్ ను కాపీ కొట్టారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి పూర్తి లుక్ కోసం నవంబర్ వరకూ ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications