శ్రీమంతుడి ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఒక్క AMB సినిమాస్ తోనే..!

ఇవాళ సూపర్ స్టార్ మహేష్ బాబు 50 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకొంటున్నారు. మహేష్ బాబు బర్త్ డేను ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో సూపర్ స్టార్ ఫొటోలు, వీడియోలతో ట్రెండింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ బర్త్ డే సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న SSMB29 నుంచి అప్డేట్ వచ్చింది. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు రాజమౌళి. నవంబర్ లో మూవీని రివీల్ చేస్తామని ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ మేరకు మహేష్ బాబు పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ లో మహేష్ మెడ భాగం మాత్రమే కనిపిస్తోంది. మెడలో రుద్రాక్ష, చుట్టూ రక్తంతో లుక్ ఆసక్తిగా ఉంది.

ఇక కెరీర్ లో మహేష్ బాబు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ చూశారు. అలాగే ప్లాఫ్ లనూ తట్టుకున్నారు. మహేష్ బాబు 20 ఏళ్లకు పైగా టాలీవుడ్ లో స్టార్ హీరోగా.. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ లెగసీ ని కంటిన్యూ చేస్తూ రాణిస్తున్నారు. మహేష్ ఇప్పటివరకు 28 చిత్రాల్లో నటించారు. ఇక మహేష్ బాబు ఆస్తుల విలువ రూ. 400 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. మహేష్ ప్రతి చిత్రానికి రూ. 70 కోట్ల నుంచి రూ. 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. అయితే రాజమౌళి చిత్రానికి మహేష్ ఏకంగా రూ. 125 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Mahesh Babu s Wealth Soars Assets Estimated at Over Rs 400 Crores

అలాగే మహేష్ బాబుకు జూబ్లీ హిల్స్ లో 30 కోట్ల విలువైన లగ్జరీ హౌస్ ఉంది. గోవా, చెన్నై, బెంగళూరులో కూడా మహేష్ కు ఆస్తులు ఉన్నాయి. మహేష్ బాబుకు ప్రైవేట్ జెట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చాలా సంస్థలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఓ రెస్టారెంట్, AMB సినిమాస్ ద్వారా రూ. 30 కోట్ల రూపాయిల సంపాదన ఉంటుందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+