నాగ చైతన్యకు కాబోయే భార్యపై మహేష్ బాబు సెటైర్లు
అభిమానులకు షాకిస్తూ హీరో నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళను నిశ్చితార్థం చేసుకున్నాడు. సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో నాగ చైతన్య సీక్రెట్‌గా రిలేషన్ మెయిన్‌టైన్ చేశారు. అభిమానులకు షాకిస్తూ గత గురువారం అతి కొద్దిమంది సమక్షంలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళల నిశ్చితార్థం జరిగింది. నాగ చైతన్య రెండో పెళ్లిపై సమంత అభిమానులు నాగ చైతన్యపై మండిపడుతున్నారు.
వైవాహిక జీవితంలో సమంత కరెక్ట్‌గానే ఉందని, నాగ చైతన్య అలా ఉండలేకపోయాడని ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే శోభిత ధూళిపాళకు సంబంధించిన పాత వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి. గతంలో శోభిత ధూళిపాళ చేసిన కండోమ్ యాడ్ ఇప్పుడు వైరల్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి శోభిత ధూళిపాళ ఓ కండోమ్ యాడ్ చేసింది.నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత శోభితా ధూళిపాళ చేసిన కండోమ్ యాడ్ గురించి ఎక్కువ మంది ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా శోభిత ధూళిపాళ గురించి గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

అడివి శేష్ హీరోగా తెరకెక్కిన మేజర్ సినిమా వచ్చింది. ఈ సినిమాను మహేష్ బాబు తన సొంత బ్యానర్‌లో నిర్మించారు. మేజర్ మూవీలో శోభిత ముఖ్యమైన పాత్రలో కనిపించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శోభిత ఇంగ్లీషులో మాట్లాడటం జరిగింది. అక్కడే ఉన్న మహేష్ బాబు కలుగజేసుకుని 'తెలుగులో మాట్లాడవా ప్లీజ్' అని సెటైర్ వేశారు. దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఎలా కవర్ చేసుకోవాలో తెలియని శోభిత తన బ్యాక్ గ్రౌండ్ మొత్తం బయటపెట్టారు. నేను తెలుగు అమ్మాయినే.. కానీ తెలుగు పెద్దగా రాదని చెప్పుకొచ్చారు. అయితే శోభితను కించపరచాలనే ఉద్దేశం మహేష్ బాబుకు లేదు. మహేష్ స్పాంటేనియస్ గా జోక్స్ వేస్తారు. అలాగే అది మేజర్ మూవీ తెలుగు వెర్షన్ ప్రమోషనల్ ఈవెంట్. అందుకే మహేష్ బాబు ఆమెకు తెలుగులో మాట్లాడాలని సూచించాడు.












Click it and Unblock the Notifications