‘అతడు’ సినిమాతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన మహేష్‌బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో రాజీపడకుండా నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. అటవీ నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా దీన్ని రాజమౌళి తీర్చిదిద్దుతున్నారు. అయితే సైలెంట్ గా షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా యూనిట ప్రస్తుతం ఒడిసా రాష్ట్రంలోని కొరాపుట్ అడవుల్లో చిత్రీకరణ జరుపుతోంది. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దర్శకుడు రాజమౌళికి ధన్యవాదాలు తెలియజేశారు. కొరాపుట్ ప్రజలు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజమౌళి ఓ లేఖను విడుదల చేశారు.
ప్రపంచంలో ఏ హీరోవల్ల కాలేదు
ఇదిలావుండగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ అరుదై ప్రపంచ రికార్డును స్థాపించారు. ప్రపంచంలోని ఏ భాషల్లో ఉన్న ఏ సూపర్ స్టార్ వల్లకాని రికార్డును తాను మాత్రే సొంతం చేసుకున్నాడు. అదేమిటంటే 2005లో తాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన అతడు సినిమా స్టార్ మా తెలుగు ఛానల్ లో ఇప్పటివరకు 1500 సార్లు టెలికాస్ట్ అయి సంచలనం సృష్టించింది. ఇంతవరకు ఏ హీరో సినిమా ఇలా టెలికాస్ట్ అవలేదు. హాలీవుడ్ హీరోలవల్ల కూడా కాలేదు. సినిమాను టెలికాస్ట్ చేస్తున్న ప్రతిసారీ విపరీతమైన రేటింగ్ వస్తోంది. దీంతో స్టార్ మా తెలుగు యాజమాన్యం పదే పదే టెలికాస్ట్ చేసింది. అలా ఎన్నిసార్లు చేస్తున్నప్పటికీ ఛానల్ కు ఆదాయం వచ్చిందేకానీ తగ్గలేదు.

టెలికాస్ట్ అయిన ప్రతిసారీ ఆదాయమే
1500 సార్లు టీవీల్లో సినిమా వచ్చినప్పటికీ ప్రజలు చూస్తున్నారంటే ఈ సినిమా వారిని ఎంతగా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. మహేష్ బాబు సినిమాల్లో అతడు అనేది ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది. జయభేరి పతాకంపై మురళీమోహన్ నిర్మించారు. ఈ సినిమాలో మహేష్ బాబు చాలా తక్కువగా మాట్లాడతారు. చాలా చిన్న చిన్న డైలాగులు చెబుతారు. మణిశర్మ సంగీతం, త్రిష నటన, బ్రహ్మానందం కామెడీ.. ఇలా అన్నీ కలిపి సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. వాస్తవానికి థియేటర్లలో ఈ సినిమా విడుదలైనప్పడు అనుకున్నంతస్థాయిలో టాక్ రాలేదు. రోజులు గడిచేకొద్దీ ప్రేక్షకులు ఈ సినిమాను చూడటానికి ఎగబడ్డారు. 2005లోనే రూ.30 కోట్ల వసూళ్లను సాధించి ఔరా అనిపించిది.












Click it and Unblock the Notifications