మురారి దెబ్బకు కల్కి రికార్డు అవుట్
సూపర్ స్టార్ మహేష్ బాబు రోజు సందర్భంగా అభిమానులు ఆయన సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈసారి ఆయన నటించిన సూపర్ హిట్ మురారి సినిమాను రీ రిలీజ్ చేశారు. మురారి మూవీకి ఫ్యాన్స్ చేసిన సెలెబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోస్ ఏ కనిపిస్తున్నాయి. ఈ రేంజ్ లో రీ రిలీజ్‌ను కూడా సెలెబ్రేట్ చేయడం కేవలం మహేష్ బాబు అభిమానులకు చెల్లింది. ఓ జంట అయితే ఏకంగా థియేటర్‌లో పెళ్లి చేసుకున్న వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
రీ రిలీజ్‌ను ఇలా కూడా సెలెబ్రేట్ చేయవచ్చా అనే విధంగా మహేష్ బాబు అభిమానులు నిరూపించారు. క్లాస్ మూవీకి మాస్ సెలబ్రేషన్స్ చేశారు అభిమానులు.రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన.. మురారి మూవీకి ఫ్యాన్స్ చేసిన సెలెబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోస్ దర్శనం ఇస్తున్నాయి. కలెక్షన్ల విషయంలో కూడా మురారి సత్తా చాటింది. అడ్వాన్స్ బుకింగ్‌లో రికార్డు క్రియేట్ చేసిన ఈ మూవీ, కలెక్షన్లు విషయంలో కూడా సరికొత్త చరిత్ర సృష్టించింది. బుక్ మై షోలో మురారి 2 లక్షల 50 వేల టికెట్లు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

ఈ మూవీ రీ రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఖుషీ సినిమాను దాటినట్లు తెలుస్తోంది. ఆంధ్ర, తెలంగాణలో ఖుషీ రీరిలీజ్‌లో 10 రోజుల్లో 7.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా.. మురారి రీరిలీజ్‌లో కేవలం రెండు రోజుల్లోనే 7.4 కోట్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. తాజాగా ఈ సినిమా ప్రభాస్ కల్కి సినిమా రికార్డును సైతం బ్రేక్ చేసినట్టు చెబుతున్నారు. వరల్డ్ వైడ్‌గా మొత్తం కల్కి సినిమాకు రూ. 2 కోట్ల గ్రాస్ వసూలు కాగా.. మురారి సినిమాకు రూ. 5 కోట్ల రూపాయలు గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. అంటే.. కల్కిపై మురారి 3 కోట్లు ఎక్కువగా కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.












Click it and Unblock the Notifications