జగన్ వీడియోను షేర్ చేసి వెంటనే డిలీట్ చేసిన మహేష్ బాబు భార్య నమ్రత
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత ఏపీ సీఎం జగన్‌కు సంబంధించిన వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ షాట్స్‌తో పాటు, సీఎం జగన్‌కు సంబంధించిన కొన్ని క్లిపింగ్స్ దర్శనం ఇచ్చాయి. ఈ వీడియోలో గుంటూరు కారం సినిమా సాంగ్ మీద మహేష్ బాబుతో పాటు జగన్ ఉన్న ఒక వీడియోని పోస్ట్ చేశారు.
ఇప్పుడు నమ్రత పోస్ట్ చేసిన వీడియో పొలిటికల్ సర్కిల్స్‌లో బాగా వైరల్ అవుతుంది. దీన్ని బట్టి మహేష్ బాబు ఫ్యామిలీ జగన్‌కి సపోర్ట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ సాగుతుంది. అయితే కొద్ది క్షణాలకే ఈ వీడియోను నమ్రత తన అకౌంట్ నుంచి డిలిట్ చేశారు. నమ్రత ఒక వీడియోకు బదులుగా మరో వీడియోను పోస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.

పొరపాటును గుర్తించి కొద్ది నిమిషాల్లోనే ఆ వీడియోను తన అకౌంట్ నుంచి తొలగించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిపోయింది. నమ్రత పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దీనిపై కొందరు విమర్శలు చేస్తుండగా, మరి కొందరు నమ్రతకు అండగా నిలుస్తున్నారు.
ఇక ఇటీవల మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనుమతి ఇవ్వడమే కాకుండా ఈ ప్రొగ్రామ్‌ను గ్రాండ్ సక్సెస్ అయ్యేలా చర్యలు తీసుకుంది. 1000 మంది పోలీసులతో జగన్ ప్రభుత్వం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బందోబస్తు కల్పిచింది. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగ్గకుండా ఈ ఈవెంట్ ఘనంగా ముగిసింది.
సీఎం జగన్, మహేష్ బాబు వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మహేష్ బాబు సతీమణి నమ్రత pic.twitter.com/yYWeitXIoi
— Telugu Scribe (@TeluguScribe) January 12, 2024
జగన్ సర్కార్ చేసిన ఏర్పాట్లపై చిత్ర యూనిట్ సైతం హర్షం వ్యక్తం చేసింది. మహేష్ బాబు సైతం తన ప్రసంగంలో గుంటూరు పోలీసులతో పాటు, వైసీపీ సర్కార్‌కు ప్రత్యేక కృతజ్క్షతలు తెలిపారు. సినిమా టికెట్లపై 50 రూపాయిల పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పైగా తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువ రోజులు టికెట్ల రేట్లను పెంచుకోవడానికి అనుమతినిస్తూ జీవో జారీ చేసింది. దీనిపై మహేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు.
-
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
భారీగా ఆస్తులు కూడబెట్టిన త్రిష.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో వీటిపై తీవ్ర చర్చ -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications