మహేష్ బాబు- అనిల్ రావిపూడి కాంబో రిపీట్..!
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన ఇప్పటి వరకూ 9 సినిమాలకు దర్శకత్వం వహించగా అన్నీ సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. 2015 లో కల్యాణ్ రామ్ తో పటాస్ సినిమాతో ఆయన సినీ కెరీర్ ప్రారంభం అయింది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టారు అనిల్ రావిపూడి. ఆ తర్వాత వరుసగా సుప్రీం, రన్ రాజా రన్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వర ప్రసాద్ గారు ఇలా వరుసగా ఆయన తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాయి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు మూవీ రీజినల్ ఇండస్ట్రీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. అటు మెగాస్టార్ కెరీర్ లోనూ బిగ్గెస్ట్ హిట్ గా ఈ మూవీ నిలిచింది.
ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి.. విక్టరీ వెంకటేశ్, కల్యాణ్ రామ్ లతో కలిసి భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి జనవరి 12 విడుదల అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ఇటీవల వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కానుంది. అయితే ఈ మూవీ తర్వాత అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా మహేష్ బాబు సైతం అనిల్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి మూవీతో బిజీగా ఉన్నారు. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ఈ పాన్ వరల్డ్ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. వారణాసి మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు గతంలోనే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక వారణాసి మూవీని ప్రపంచవ్యాప్తంగా 120 కు పైగా దేశాల్లో, 50 కు పైగా అంతర్జాతీయ, ప్రాంతీయ భాషల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఇప్పటికే వారణాసి మూవీ షూటింగ్ చివరి దశకు చేరింది. దాంతో వీలైనంత త్వరగా ఈ మూవీని పూర్తి చేసి తదుపరి సినిమాకు వెళ్లేందుకు మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నారట. అన్నీ కుదిరితే 2028 సంక్రాంతి టార్గెట్ గా మహేష్ బాబు- అనిల్ రావిపూడి సినిమా రానున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే వీరిద్దరి కాంబోలో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications