ఆ హీరోయిన్‌ను ఎక్కడికి పడితే అక్కడకు తిప్పాడు..ఇప్పుడు వదిలేశాడు..!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మలైకా అరోరా క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. 50 ఏళ్ల వయస్సులో కూడా హాట్‌గా ఎలా కనిపించాలో మలైకా అరోరాను చూసే నేర్చుకోవాలి. అందాల ఆరబోతకు మలైకా అరోరా పెట్టింది పేరు. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్న మలైకా అతనితో ఓ బాబుకు జన్మనిచ్చింది.
ఆ తర్వాత వీరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో భర్త అర్బాజ్ ఖాన్‌కు మలైకా విడాకులిచ్చింది. ప్రస్తుతం తనకంటే తనకంటే 12 సంవత్సరాల చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. వీరిద్దరు చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోలు, వీడియోలు చాలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అర్జున్ కపూర్ ద్వారా మలైకా గర్భం దాల్చినట్టు వార్తలు వచ్చాయి. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకోవడమే మిగిలిందనుకున్నారు.

అయితే ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ ఈ జంట విడిపోయారనే వార్తలొస్తున్నాయి. గత కొంతకాలంగా వీరద్దరు కలిసి కనిపించడం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ ఈవెంట్ అయినా .. ఏ ఫంక్షన్ అయినా.. కలిసి దర్శనం ఇచ్చే ఈ జంట.. ఇప్పుడు సింగిల్‌గా కనిపిస్తున్నారట.ఇటీవల సింగిల్‌గానే మలైకా అరోరా హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తుంది. ఆమె పక్కన అర్జున్ కపూర్ కనిపించడం మానేశారు. ఇటీవల జరిగిన అంబానీ ఇంట పెళ్లిలో కూడా అర్జున్ కపూర్ సింగిల్‌గానే కనిపించాడు.
దీంతో వీరిద్దరి రిలేషన్‌కు బ్రేక్ పడిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజగా దీనిపై అర్జున్ కపూర్ క్లారిటీ ఇచ్చాడు. దీపావళి పార్టీలో పాల్గొన్న అర్జున్ కపూర్ తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై ఓపెన్ అయ్యాడు. మీరు రిలేషన్‌లో ఉన్నారా? అని అడగ్గా.. దానికి అర్జున్ కపూర్ స్పందిస్తూ.. ''లేను ఒంటరిగా, ప్రశాంతంగా ఉన్నాను'' అని చెప్పాడు. దీంతో మలైకా అరోరాతో ఉన్న రిలేషన్‌కు అర్జున్ కపూర్ బ్రేకప్ చెప్పాడని అందరికి అర్థం అయింది. అయితే వీరి బ్రేకప్‌కు గల కారణాలు మాత్రం అర్జున్ కపూర్ వెల్లడించలేదు.












Click it and Unblock the Notifications