హోటల్ పై డ్రగ్స్ రైడ్... మూడో అంతస్తు నుంచి దూకి హీరో పరార్..?

సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కల్చర్ నానాటికీ పెరిగిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా లాభం లేకుండా పోయింది. డ్రగ్స్ వాడకం నిషిద్ధమని, ఎంతమంది అధికారులు చెప్పినా సరే వినడం లేదు. ముఖ్యంగా పబ్బులు, పార్టీలు పేరిట ఈ డ్రగ్స్ వాడుతూ మనుషులు కాస్త మృగాలుగా మారిపోతున్నారు. అయితే తాజాగా ఒక హోటల్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ హోటల్ పై డ్రగ్స్ రైడ్ నిర్వహించారు.

పోలీసులు హోటల్ ను చుట్టుముట్టారని తెలుసుకున్న ఓ హీరో హోటల్ మూడో అంతస్తు నుంచి స్విమ్మింగ్ ఫూల్ లోకి దూకి మరీ పరార్ అయ్యాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ క్లిప్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కొచ్చి హోటల్లో డ్రగ్స్ రైడ్ సమయంలో పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. మూడో అంతస్తు నుంచి స్విమ్మింగ్ పూల్ లోకి దూకి తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని.. షైన్ టామ్ చాకోను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

మరోవైపు మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్.. గతంలో షైన్ టామ్ చాకూ సంచలన ఆరోపణలు చేసింది. డ్రగ్స్ తీసుకుని తనను ఇబ్బంది పెట్టాడని.. తన ముందే బట్టలు మార్చుకోవాలని ఒత్తిడి చేసేవాడని ఎమోషనల్ అయింది. తాజాగా షైన్ డ్రగ్స్ రైడ్ నుంచి తప్పించుకోవడంతో ఈ విషయాలు కాస్త మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Malayalam Actor Shine Tom Chacko Escapes During Police Drug Raid

షైన్ టైమ్ చాకో తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. నాని హీరోగా నటించిన దసరా సినిమాలో విలన్ గా నటించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో ఈయన నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇక తర్వాత రంగబలి,దేవర, దాకు మహారాజ్, రాబిన్ హుడ్ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం పలు తమిళం, మలయాళం చిత్రాల్లో బిజీగా ఉన్నాడు. ఈలోగా ఆయన డ్రగ్స్ కేసులో పట్టుబడటం సంచలనంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+