పబ్లిక్‌గా ఆ నటిని క్షమించమని కోరిన దసరా విలన్..

దసరా సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ప్రముఖ నటుడు " షైన్ టామ్ చాకో ". ఆ తర్వాత దేవర సహా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే టామ్ చాకోకు నటి విన్సీ సోనీ అలోషియస్ మధ్య నడుస్తున్న వివాదం మలయాళ సినీ పరిశ్రమలో గత కొద్ది నెలలుగా చర్చ నడుస్తోంది. కాగా తాజాగా ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టారు. పబ్లిక్ గా అందరి ముందు క్షమాపణలు చెప్పడం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.

'సూత్రవాక్యం' అనే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. లేటెస్ట్ గా నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమంలో ఇద్దరూ ఒకే వేదికపై కనిపించారు. ఈ క్రమంలోనే చాకో మాట్లాడుతూ.. తన ప్రవర్తన వల్ల విన్సీకి కలిగిన బాధకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. కావాలని అలా చేయలేదని.. సరదాగా మాట్లాడిన మాటలే అని.. అవి ఈ స్థాయికి వెళ్తాయని అనుకోలేదని చెప్పుకొచ్చారు. విన్సీ స్పందించిన తీరు కూడా ఆమెను ఎవరో ప్రేరేపించినట్లుంది అని చెప్పుకొచ్చారు.

malayalam-actor-shine-tom-chako-sorry-to-actress-vincy

ఇక వెంటనే ఆయన పక్కనే కూర్చున్న విన్సీ మాట్లాడుతూ.. ఆ సమయంలో తాను నిజంగానే అసౌకర్యంగా ఫీల్ అయ్యానని వాపోయారు. చాకో అలా ప్రవర్తిస్తారని అనుకోలేదని తెలిపారు. ఇక తాను స్పందించిన తీరు కూడా ఆయన కుటుంబాన్ని ఎంతో బాధించిందని.. ఇప్పుడు ఆ వివాదం సమసిపోయిందని వివరించింది. ఆ తర్వాత చాకో మాట్లాడుతూ.. నిజంగా నిన్ను బాధపెట్టేలా నేను ప్రవర్తించి ఉంటే క్షమించు అని చెప్పడంతో.. విన్సీ ఇప్పుడు ఆయనపై గౌరవం మరింత పెరిగిందని స్పష్టం చేసింది.

ఇక గత ఏడాది ఏప్రిల్‌లో విన్సీ అలోషియస్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. షైన్ టామ్ చాకో తనతో సెట్స్‌లో అసౌకర్యంగా ప్రవర్తించాడని మలయాళ ఫిల్మ్ ఛాంబర్‌కు కూడా ఫిర్యాదు చేశానని వెల్లడించింది. అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశం తనకు లేదని.. కానీ ఇండస్ట్రీలో మహిళల సమస్యలకు స్పందించాల్సిన బాధ్యత పెద్దలదని పేర్కొంది.

మరోవైపు కొంత కాలం క్రితమే చాకో కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వారు ప్రయాణిస్తున్న కారు తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఆయన తండ్రి సి.పి. చాకో ప్రాణాలు కోల్పోగా.. టామ్ చాకోతో పాటు ఆయన తల్లి తీవ్రగాయాలతో బయటపడ్డారు. తమిళనాడులోని ధర్మపురి సమీపంలోని సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై వారి వాహనం ప్రమాదానికి గురైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+