నా పెళ్లి ఎప్పుడనేది అతని ఇష్టమే.. మల్లూ బ్యూటీ కామెంట్స్ వైరల్ !!
'మమిత బైజు'.. ఈ కేరళ ముద్దుగుమ్మ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. గత కొంతకాలంగా మలయాళం సినిమాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నసీన్, మమితా కలిసి నటించిన "ప్రేమలు" చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అయ్యి మంచి హిట్ కొట్టింది. ఈ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ భామ. రీసెంట్ గానే ప్రదీప్ రంగనాథన్ సరసన "డూడ్" చిత్రంలో నటించి అదరగొట్టింది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ నటికి మరింత ఫాలోయింగ్ పెరిగింది.
అలానే ఈ మలయాళ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే క్రేజ్‌తో పాటు అమ్మడికి లవ్ ప్రపోజల్స్ కూడా గట్టిగానే వస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిపై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మమితా రియాక్ట్ అయ్యింది. తన పెళ్లి ఎవరితో జరగాలి? ఎప్పుడు జరగాలి? అనేది ఒకరు ఫిక్స్ చేస్తారని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే ఆమె చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి.

ఎవరా వ్యక్తి..?
మమితా ఇంకా మాట్లాడుతూ.. లైఫ్‌లో ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా తన అన్నయ్యను అడుగుతా అని తెలిపింది. తన అన్నయ్య మిథున్ స్టేట్ లెవల్ క్రికెట్ ప్లేయర్ అని.. వారి మధ్య అన్నాచెల్లెళ్ల రిలేషన్ కంటే ఫ్రెండ్ షిప్ ఎక్కువ ఉందని చెప్పుకొచ్చింది. తన పెళ్లి విషయంలో అన్నయ్య ఇచ్చే సలహానే ఫైనల్ ఓపెన్ అయ్యింది. అంతే కాకుండా ప్రేమలు సినిమా హిట్ అయ్యాక చాలా లవ్ ప్రపోజల్స్ వచ్చాయని.. కొందరైతే తన నెంబర్ తెలుసుకొని మెసేజ్‌లు పడుతున్నారని రివీల్ చేసింది. కానీ తాను మాత్రం వాటిని చదవనని.. అవి కూడా తన అన్నయ్యే చూస్తాడాని బయటపెట్టింది.
ఇక మరోవైపు దళపతి విజయ్ నటిస్తున్న "జన నాయగన్ " చిత్రం జనవరి 9న పొంగల్ కానుకగా గ్రాండ్‌గా విడుదల కానుంది. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పవర్‌ఫుల్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ మూవీలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుండగా.. మమిత బైజు విజయ్ కూతురు పాత్రలో కనిపించనుంది. విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతూ కెరీర్‌లో చివరి సినిమాగా ఇందులో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

-
లాగిపెట్టి కొట్టిన అపరిచితుడు.. నడిరోడ్డుపై ఏడుస్తూ హీరోయిన్ గోడు! వీడియో -
"ధురంధర్ 2" ట్రైలర్ రిలీజ్.. రూ.2 వేల కోట్లు కలెక్షన్స్ పక్కా !! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..!












Click it and Unblock the Notifications