పెళ్లికి రెడీ అయిన స్టార్ బ్యూటీ.. వరుడు ఇతనే ???
ప్రముఖ నటి సంయుక్త తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. మలయాళం హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో కూడా ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ఉంది. 'పాప్‌కార్న్' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది ఈ కేరళ కుట్టి. తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' చిత్రంతో అడుగుపెట్టింది. ఆ తర్వాత 'బింబిసార', 'సార్', 'విరూపాక్ష' వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ముఖ్యంగా 'విరూపాక్ష'లో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.
రీసెంట్ గానే Akhanda 2, శర్వానంద్‌తో Nari Nari Naduma Murari చిత్రాలలో నటించి మంచి హిట్స్ దక్కించుకుంది. ప్రస్తుతం సుమారు 30 ఏళ్ల వయసులోనే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సంయుక్త, వరుస ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతోంది. నిఖిల్ సరసన 'స్వయంభు', 'బ్లాక్ గోల్డ్' వంటి సినిమాల్లో నటిస్తున్న ఈ భామ.. తన పాత్రల ఎంపికలో జాగ్రత్తగా ముందుకు సాగుతోంది. అలాగే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో కూడా హీరోయిన్‌గా చేసింది.

అంతే కాకుండా బెల్లంకొండ శ్రీనివాస్‌తో మరో ప్రాజెక్ట్.. మలయాళంలో Ram చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్‌లో కూడా Maharani: The Queen of Queens అనే ప్రాజెక్ట్‌తో ఎంట్రీ ఇస్తోంది. అటు కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను కూడా ఎంపిక చేసుకోవడం ఆమె ప్రత్యేకతగా మారింది. కాగా ఇంత బిజీ కెరీర్ మధ్య సంయుక్త వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా ఆమె పెళ్లి గురించి వస్తున్న పుకార్లు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే గతంలోనే ఈ వార్తలపై స్పందించిన సంయుక్త, "ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచన లేదు, నా పూర్తి దృష్టి కెరీర్‌పైనే ఉంది" అని క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ ఈ రూమర్స్ మళ్లీ మళ్లీ తెరపైకి వస్తూనే ఉన్నాయి. వరుస హిట్స్, క్రేజీ ఆఫర్లు, పాన్ ఇండియా ప్రాజెక్టులతో సంయుక్త మీనన్ ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో హాట్ ఫేవరెట్ హీరోయిన్‌గా కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications