లిప్ లాక్ ఇవ్వాలంటే ఆ పని చేయాల్సిందే అంటున్న హీరోయిన్ !
ప్రముఖ మలయాళీ నటి సురభి లక్ష్మీ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. గత ఏడాది టోవినో థామస్ నటించిన ARM సినిమా రిలీజ్ అయ్యింది. మలయాళంతో పాటు తెలుగులో కూడా మంచి ఆదరణ పొందింది ఆ చిత్రం. ఆ చిత్రంలో అంబారాల వీధిలో అంటూ వచ్చే సాంగ్ బాగా ఫేమస్ అయ్యింది. ఆ సాంగ్ లో నటించిన ఉన్న మహిళ అంటే అందరూ గుర్తు పడతారు.
అలానే గతేడాది మలయాళంలో విడుదలై భారీ విజయాన్ని సాధించిన చిత్రాల్లో రైఫిల్ క్లబ్ కూడా ఉంది. భారీ తారాగణం లేకపోయినా కూడా చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ సాధించింది ఆ చిత్రం. ఏకంగా రూ.30 కోట్లు వసూళ్లు రాబట్టి అందరికీ షాక్ ఇచ్చింది. సురభి లక్ష్మీ ఈ సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషించారు.

అయితే ఈ మూవీలో సురభి లక్ష్మీ లిప్ లాక్ సీన్ కూడా చేశారు. రీసెంట్ గా ఇ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సీన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. మూవీ రైటర్ శ్యామ్ స్టోరీ చెప్పినప్పుడే కిస్ సీన్ ఉంటుందని చెప్పాడని.. కానీ షూటింగ్ సెట్ లో మాత్రం లిప్ లాక్ అని చెప్పడంతో షాకయ్యానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సురభి లక్ష్మీ.
ఆ చిత్రంలో సంజీవ్ తన భర్త పాత్రలో నటించాడని.. లిప్ లాక్ సీన్ చేసే ముందు అతనితో మాట్లాడి కండిషన్ పెట్టానని తెలిపింది. సంజీవ్ ఈ చిత్రంలో సిగరెట్ స్మోకర్.. పలు సీన్స్ లో కూడా స్మోకింగ్ చేస్తూ ఉంటారని అందుకే లిప్ లాక్ సీన్ చేసే ముందు అతడిని బ్రష్ చేయమని చెప్పానని వెల్లడించింది. అంతే కాకుండా ఆ సీన్ చేయాలంటే ఫుడ్ సెక్షన్ వాళ్లను పిలిచి యాలకులు తెమ్మని చెప్పానన్నారు. వాటిని తినమని అతనికి ఇచ్చానని.. అలా ఆ సీన్ పూర్తి చేశామని చెప్పుకొచ్చింది.
సీన్ చేసే ముందు సంజీవ్ ఎలా ఫీల్ అయ్యాడో తెసుకోవాలని కూడా ప్రయత్నించానని చెప్పింది సురభి. టెన్షన్ గా ఉన్నావా? అని అడిగానని.. కానీ అతను కూడా తన లాగే ఏ టెన్షన్ పడడంలేదని చెప్పాడు అంటూ గుర్తు చేసుకుంది. మరోవైపు సురభి లక్ష్మీ 2017లో మిన్నమినుంగు సినిమాలో తల్లి పాత్రలో నటించింది. ఇందులో ఆమె పాత్రకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. మలయాళంలో ఎక్కువగా పాత్రలకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటిస్తున్న సురభి లిప్ లాక్ చేయడం అప్పుడు పెద్ద డిస్కషన్ కూడా నడిచింది.












Click it and Unblock the Notifications