తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో టార్చర్ పెట్టాడు: ఉత్తమ నటి ఎమోషనల్
గతంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. దర్శక నిర్మాతలు, హీరోలు.. కొత్తగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్లతో వ్యవహారాలు నడిపినా పెద్దగా బయటకు వచ్చేవి కాదు. ఇండస్ట్రీలో ఎవరికి చెప్పాలో తెలియక లోలోపల కుమిలి పోయేవారు. మరికొంతమంది సున్నిత మనసు కలిగిన వాళ్లు బలవన్మరణానికి పాల్పడేవాళ్లు. కానీ సోషల్ మీడియా అధికం అయిన తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో ఏం జరిగినా నిర్భయంగా బయటకు వచ్చి చెబుతున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి వైరల్ అవుతున్నాయి.
అయితే తాజాగా ఓ మలయాళ నటి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఈ మేరకు ఎమోషనల్ అయింది. ఆ మలయాళ నటి మరెవరో కాదు విన్సీ సోనీ అలోషియస్. 2019లో విన్సీ మళయాల ఇండస్ట్రీలోకి ఆరంగేట్రం చేసింది. 'రేఖ' అనే మూవీతో కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన 'జనగణన' చిత్రం అభిమానుల నుంచి మంచి గుర్తింపు లభించింది.

అయితే తాజాగా ఆమె ఓ సినిమా సెట్ లో హీరో తనతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. డ్రగ్స్ తీసుకొని వచ్చి తనతో అనుచితంగా ప్రవర్తించాడని వాపోయింది. అంతేకాక తన ముందే బట్టలు మార్చుకోవాలని ఇబ్బందిపెట్టాడని చెప్తూ ఎమోషనల్ అయింది. షూటింగ్ జరిగినన్ని రోజులు అలానే ఇబ్బంది పెట్టారని ఏడ్చేసింది. డ్రగ్స్ అలవాటు ఉన్న నటులతో కలిసి నటించకూడదని ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తనకు ఎదురైన వేధింపుల ఘటన అందరికి తెలిసిన కూడా ఎవరూ మాట్లాడలేదని విన్సీ సోనీ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం విన్సీ సోని వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.
తాను తీసుకున్న నిర్ణయం కారణంగా తనకు సినిమాల్లో అవకాశాలు ఒక్కసారిగా తగ్గాయని విన్సీ తెలిపింది. అయినా తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని భయపడకుండా చెబుతున్నానని అన్నారు. తనతో అలా ప్రవర్తించిన హీరో ఎవరో అందరికీ తెలుసని.. ఆయన పేరును ఎవరూ బహిర్గతం చేయరని అన్నారు విన్సీ.












Click it and Unblock the Notifications