జస్ట్ 5 కోట్లతో తీస్తే 50 కోట్లు.. ఓటీటీలోకి బుర్రపాడు మిస్టరీ థ్రిల్లర్..
మలయాళం నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకుల్ని ఎంతలా థ్రిల్ చేస్తాయో తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో కంటెంట్ ఉన్న సినిమాల్ని తీయడమే వారి స్పెషాలిటీ. 5-10 కోట్లతో సినిమా తీస్తే బాక్సాఫీస్ వద్ద రూ. 50-100 కోట్లు వసూళ్లు సాధిస్తుంటాయి. ఇక మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో భారీగా క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. కేవలం రూ. 5 కోట్లతో ఈ సినిమా తీస్తే బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లు వసూళ్లు సాధించింది.
తెలుగు ప్రేక్షకులు మలయాళం సినిమాలను అసలు మిస్ అవరూ. ఓటీటీలో వస్తే వెంటనే చూసేస్తారు. ఇక మలయాళం నుంచి వస్తే మిస్టరీ, థ్రిల్లర్, హారర్ మూవీస్ అయితే అసలు వదిలిపెట్టరు. ఇలాంటి సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. గతేడాది కిష్కింధ కాండం అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు దిన్జిత్ అయ్యతన్.. ఈ ఏడాది మరో బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించారు. అదే 'ఎకో' మూవీ. కేవలం రూ. 5 కోట్లతో ఈ సినిమా తీస్తే బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లు వసూళ్లు సాధించిందీ మూవీ.
ఈ మూవీలో అలపుజా జింఖానా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ నటుడు సందీప్ ప్రదీప్ ప్రధాన పాత్రలో నటించాడు. అలాగే వినీత్, నరైన్ కీలక పాత్రల్లో మెరిశారు. నవంబర్ 21న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ విమర్శకులనుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు సిద్ధం కానుంది.

నూతన సంవత్సరం కానుకగా డిసెంబర్ 31 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. కేరళ, కర్ణాటక సరిహద్దులోని కాట్టుకున్ను అనే అటవీ ప్రాంతం నేపథ్యంలో ఈ స్టోరీ సాగుతుంది.
-
భారీగా ఆస్తులు కూడబెట్టిన త్రిష.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో వీటిపై తీవ్ర చర్చ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications