25 ఏళ్ల తర్వాత ఓటీటీ రిలీజ్.. అన్నీ నెక్స్ట్ లెవెల్ సీన్స్, ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు !
కరోనా మహమ్మారి సినిమాల విషయంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చింది. ఆ ఎఫెక్ట్ తోనే ఓటీటీల ప్రభావం ప్రజలపై గట్టిగానే చూపింది. దాంతో భాషతో సంబంధం లేకుండా ప్రజలు అన్నీ సినిమాలను చూస్తూ వస్తున్నారు. అలా సినిమా రిలీజ్ అవుతుందో లేదో.. నెల తిరిగే లోపు ఓటీటీ లోకి వచ్చేస్తోంది. కానీ థియేటర్లో రిలీజ్ అయిన 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయిన ఓ చిత్రం దుమ్ము రేపుతోంది.
అయితే ఈ సినిమాను కుటుంబంతో కలిసి మాత్రం చూడొద్దని.. అన్నీ నెక్స్ట్ లెవెల్ సీన్స్ అని ముందే హింట్ ఇస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. ఆ మూవీ ప్రత్యేకత ఏంటి.. ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో తెలుసుకుందాం..

మూవీ ఏదంటే..?
2000 సంవత్సరం అక్టోబర్ 27న థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా 'మలేనా'. ఇటాలియన్ నటి మోనికా బెల్లూచి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అప్పట్లోనే దాదాపు రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కానీ ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ శ్రుతిమించి ఉండడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ చిత్రానికి లూసియానో విన్సెంజోని కథ అందించగా.. గియుసేప్ టొర్నాటోర్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాకు 73వ అకాడమీ అవార్డ్స్ లో బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో రెండు ఆస్కార్లు కైవసం చేసుకుంది.
సినిమా స్టోరీ..
1940ల యూరోప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మొత్తం రెండు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. మలేనా, 12 ఏళ్ల రెనాటో మధ్య ఆకర్షణ, ప్రేమ వంటి సీన్లతో ఈ మూవీ సాగుతుంది. 12 ఏళ్ల అబ్బాయితో మలేనా ప్రేమ.. ఆకర్షణ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించారు. ఒంటరిగా జీవించే మహిళపై సమాజం ఎలాంటి అభిప్రాయానికి వచ్చింది.. ? ఆమెతో ఎలా స్పందించింది అనేది సినిమా. 12 ఏళ్ల బాలుడు రెనాటో పాత్రలో గియుసేప్ సల్ఫారో నటించారు.
ఇక ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మార్చి 29 నుంచి 8 భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ఈ సినిమాకు ఐఎండీబీలో 7.4 రేటింగ్ ఉంది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications