భారతీయ మగాళ్లపై మల్లికా షెరావత్ సెన్సేషనల్ కామెంట్స్.. నెటిజన్లు ఫైర్ !
'ద ట్రెయిటర్ సీజన్ 2' రియాలిటీ షోలో బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. భారతీయ పురుషుల కంటే యూరోపియన్ పురుషులే ఎంతో బెటర్ అంటూ మల్లికా షెరావత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మల్లికా షెరావత్ చేసిన కామెంట్లపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇది సరైన పోలిక కాదని మండిపడుతున్నారు.
షోలో అసలేం జరిగిందంటే?
రియాలిటీ షోలోని ఆరో ఎపిసోడ్‌లో నటి శ్వేతా తివారీ, రియా చక్రవర్తిలతో మల్లికా షెరావత్ మాటల సందర్భంలో ఈ విషయం చర్చకు వచ్చింది. రెండుసార్లు విడాకులు తీసుకున్న శ్వేతా తివారీకి మల్లిక మ్యాచ్ మేకర్(పెళ్లిళ్ల పేరయ్య)గా మారతానని చెప్పింది. శ్వేతను అమితంగా ప్రేమించే, గౌరవించే ఒక మంచి యూరోపియన్ వ్యక్తితో పెళ్లి జరిపిస్తానని అన్నది. ఈ క్రమంలో భారతీయ పురుషుల కంటే యూరోపియన్లే నయమా అని రియా ప్రశ్నించగా.. 'అందులో సందేహమేముంది? కచ్చితంగా వాళ్లే బెటర్' అని మల్లికా షెరావత్ బదులిచ్చింది.

నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత
మల్లికా షెరావత్ చేసిన ఈ కామెంట్లపై నెటిజన్ల నుంచి భిన్న రకాల ప్రతిస్పందనలు వెలువడుతున్నాయి. 'ఎవరినైనా ఇష్టపడటంలో తప్పులేదు, కానీ అందరు భారతీయ పురుషులను ఒకే తీరుగా జమకట్టడం సరికాదు' అని కొందరు హితవు పలికారు. 'ప్రపంచవ్యాప్తంగా మంచి, చెడు మనుషులు ప్రతిచోటా ఉంటారని, కేవలం ఒక దేశానికో లేదా ప్రాంతానికో దీనిని ఆపాదించడం తగదు' అని మల్లికా షెరావత్ తీరును తప్పుబడుతున్నారు.
శ్వేతా తివారీ వ్యక్తిగత నేపథ్యం
ఈ చర్చకు ముందు ఎపిసోడ్‌లో శ్వేతా తివారీ తన గత వివాహ బంధాల గురించి భావోద్వేగంగా మాట్లాడారు. తనకు ఎదురైన చేదు అనుభవాలను, తన ఇద్దరు మాజీ భర్తలు మోసం చేయడాన్ని ఆమె వెల్లడించారు. శ్వేతా తివారీ గతంలో రాజా చౌదరిని వివాహం చేసుకోగా.. 2007లో వారికే విడాకులయ్యాయి.అనంతరం 2013లో అభినవ్ కోహ్లీని వివాహమాడిన ఆమె.. కుటుంబ కలహాల కారణంగా 2019లో ఆయన నుంచి కూడా విడిపోయారు.













Click it and Unblock the Notifications