రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ చిత్రం 'పెద్ది'. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
ఈ మూవీని గ్రామీణ వాతావరణంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ గ్లింప్స్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముందుగా వచ్చిన వీడియోలో చరణ్ ఫుల్ గా జుట్టు, గడ్డంతో రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించి అదరగొట్టారు. అంతే కాకుండా ఉత్తరాంధ్ర యాసలో ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాలి.. పుడాతామా ఏంటి మళ్లీ.. అంటూ చెప్పిన డైలాగ్ తెగ వైరల్ అయ్యింది. అంతే కాకుండా మరి ముఖ్యంగా రామ్‌చరణ్ కొట్టే ఐకానిక్ క్రికెట్ షాక్ కూడా ఫుల్ ట్రెండింగ్ అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఉండబోయే ఒక మాస్ స్పెషల్ సాంగ్ గురించి గత కొన్ని రోజులుగా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. మొదట ఈ పాట కోసం బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్‌ను అనుకున్నప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మృణాల్ స్థానంలో మిస్ ఇండియా 2020 విజేత మానస వారణాసి (Manasa Varanasi) ఫిక్స్ అయినట్టు టాక్ వినిపిస్తుంది.
కాగా ఇప్పటికే తన అందచందాలతో మెప్పించిన ఈ తెలుగమ్మాయి.. రీసెంట్ గానే సంతోష్ శోభన్ సరసన " కపుల్ ఫ్రెండ్లీ" చిత్రంలో నటించి హిట్ కొట్టింది. ఆ మూవీలో ఈ ముద్దగుమ్మ నటనకు మంచి మార్కులే పడ్డాయి. దాంతో ఇప్పుడు మెగా పవర్ స్టార్ పక్కన స్టెప్పులేస్తే నెక్స్ట్ లెవెల్ క్రేజ్ పొందడం పక్కా అంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో సైతం ప్రభాస్ ఆమె నటన బాగా నచ్చిందని చెప్పిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ లో పహిల్వాన్ గ్లింప్స్ ..
ఇకపోతే మార్చి 27వ తేదీ రామ్ చరణ్(Ramcharan) పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి పహిల్వాన్ గ్లింప్స్ (pehelwan glimpse )అంటూ ఒక వీడియోని విడుదల చేశారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారు అంటూ సందేహ పడుతున్నారు.
-
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
‘అరవ’ దర్శకులను నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే! -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే -
చిక్కుల్లో పడ్డ యంగ్ హీరో.. పార్టీలకు రావాలంటూ అమ్మాయిలకు మెసేజ్‌లు? -
బెస్ట్ యాక్టర్‌గా మరో అవార్డ్ అందుకున్న అక్కినేని హీరో..! -
మహేష్ బాబు " వారణాసి " స్టోరీ ఇదే.. పాన్ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ పక్కా ? -
బిగ్ షాక్ : ప్రభాస్ "స్పిరిట్" షూటింగ్ సెట్లో అగ్ని ప్రమాదం.. -
ఆ స్టార్ డైరెక్టర్ అందరి ముందు చీర విప్పి పడుకోమన్నాడు !! -
ఎక్స్ క్లూజివ్.. అంతా చూడొచ్చు.. డిజిటల్ బెగ్గింగా ? డిజిటల్ వ్యభిచారమా ?? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా?












Click it and Unblock the Notifications