భర్తతో విడిపోవడంపై మౌనం వీడిన మంచు లక్ష్మి
మంచు లక్ష్మికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిర్మాతగా, నటిగా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటరామె. సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేస్తుంటారు. ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో మంచు లక్ష్మి తర్వాతే ఎవరైనా. దీనిపై ఆమె చాలానే విమర్శలు ఎదుర్కొన్నారు.
అయినప్పటికి తన పంథాను ఏమాత్రం మార్చుకోకుండా ముందుకు సాగుతున్నారు.ఇక మంచు లక్ష్మి పెళ్లిపై కూడా అనేక ఊహాజనిత కథనాలు ప్రసారంలో ఉన్నాయి.ఆమె చదువుకుంటున్న సమయంలోనే తన కాలేజీ స్నేహితుడుని ప్రేమించి పెళ్లి చేసుకుందని..ఇంటి నుండి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి మరీ అతన్నిపెళ్ళాడిందనే వార్త అప్పట్లో బాగానే వైరల్ అయింది. అయితే పెళ్లైన కొద్ది రోజులకే ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఆమె విడాకులు ఇచ్చిందని..ఈ విడాకులు వెనుక తండ్రి మోహన్ బాబు హస్తం ఉంది అనేది ఆరోపణలు వినిపించాయి. మొదటి భర్తకు విడాకులిచ్చిన తర్వాత ఆండ్రు శ్రీనివాస్‌తో మంచు లక్ష్మి పెళ్లి జరిపించారట మోహన్ బాబు.వీరికి ఓ పాప కూడా ఉంది.

అయితే భర్త ఆండ్రు శ్రీనివాస్‌తో మంచు లక్ష్మి పెద్దగా ఎప్పుడు బయట కనిపించలేదు.దీంతో మంచు లక్ష్మి భర్తకు దూరంగా ఉంటుందని, వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై మంచు లక్ష్మి రియాక్ట్ అయ్యారు.నా భర్త ఫారెన్‌లో ఐటీ ప్రొఫెషనల్‌గా వర్క్ చేస్తున్నారు. మేము మా వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగానే ఉంటామని మంచు లక్ష్మి తెలిపారు. మా ఇద్దరికి బాధ్యతలు ఉన్నాయని, ప్రస్తుతం నేను నా భర్తతో కలిసి ఉన్నానని, మాకు ఎలా అనిపిస్తే అలా బతుకుతున్నాము.. జనాలు ఏమనుకుంటారో అని ఆలోచించలేమని ఆమె తెలిపారు.తన కూతురు ఇప్పుడు భర్త దగ్గర ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
నా ఆస్తులు చూసి నేనే షాకయ్యా: తనికెళ్ల భరణి సెటైర్లు! -
నన్ను బలిపశువును చేస్తున్నారు! -
T20 World Cup Final: సౌతాఫ్రికాతో పైనల్ వీళ్లకే- పాక్ మాజీ కెప్టెన్ జోస్యం..! -
జాక్‌పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
ఇరగదీశావ్ పో..: రామ్ చరణ్ డాన్స్ మూమెంట్స్ మెగాస్టార్ ఫిదా -
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త పథకం అమల్లోకి..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
ఓటీటీలోకి కిర్రాక్ కామెడీ మూవీ.. పొట్టు పొట్టు నవ్వుకోండి..! -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్‌గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..? -
చంద్రగ్రహణం కారణంగా కలిసొచ్చే రాశులు, కష్టాలొచ్చే రాశులు ఇవే!












Click it and Unblock the Notifications