నన్ను చూస్తే లేచి నిలుచుంటారు: మంచు లక్ష్మి
తెలుగు సినీ పరిశ్రమలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. సినిమాలు, అందం కంటే తన లాంగ్వేజ్ తోనే పాపులర్ అయింది. మోహన్ బాబు కూతురుగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించారు. అనగనగా ఒక ధీరుడు, గుండెల్లో గోదారి, చందమామ కథలు లాంటి సినిమాల్లో నటించారు. వాటికంటే ముందుగానే కొన్ని అమెరికన్ టీవీ సిరీస్ లు చేసి మంచి గుర్తింపును పొందారు.
బుల్లితెరపై పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించి యాంకర్ గా కూడా రాణించారు. లెస్బియన్ గా నటించి క్రిటికల్ అప్లాజ్ అందుకుంది. సినిమాలలో నటించకపోయినా తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తుంటారు. సోషల్ మీడియాలో తరచూ ఆమె ట్రోలింగ్ కు గురవుతుంటుంది. ఇటీవలే హైదరాబాద్ నుంచి ముంబై కి మకాం మార్చేసింది లక్ష్మీ.

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మీ కి ఈ విషయం గురించి ఓ ప్రశ్న ఎదురైంది. దాంతో ఆ విషయంపై స్పందించిన ఈ అమ్మడు హైదరాబాద్ లో తనను చూసి అందరూ లేచి నిల్చుంటారని, ఇక్కడ మాత్రం తనను పరిచయం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఏ మనిషైనా తన జీవితంలో పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటూ చెప్పుకొచ్చింది. దీనిపై నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మంచు ఫ్యామిలీని ముంబయిలో ఎవరు పట్టించుకున్నారు? అక్కడ అంత బిల్డప్ ఇస్తున్నావు? అంటూ కామెంట్లు చేస్తున్నారు. తమరు పక్క నుంచి వెళ్లినా ఒక్కరు కూడా సెల్ఫీ అడగరని, అలాంటిది లేచి మరీ గౌరవం ఇస్తారా? అంటూ మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications