మొత్తానికి అసలు విషయం రివీల్ చేసిన మంచు లక్ష్మీ.. అందుకే ఇలా అంటూ !
తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు ఫ్యామిలీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మోహన్ బాబు. ఇక ఆయన వారసులుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ. ప్రేక్షకుల్లో గుర్తింపు పొందినప్పటికీ.. స్టార్ హీరో రేంజ్ కి ఎదగలేకపోయారు. గత కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య విభేదాలు కారణంగా కుటుంబ పంచాయతీ రోడ్డుకెక్కింది.
మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య ఇష్యూ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. గొడవలు, కేసులతో మొదలైన ఈ తతంగం ఇప్పుడు డైరెక్ట్ గానే కామెంట్స్ చేసుకునే స్థాయికి చేరింది. రీసెంట్ గా రక్తం పంచుకొని పుట్టినవాళ్లే తన పతనాన్ని కోరుకుంటున్నారని విష్ణు ఘాటుగా వ్యాఖ్యానించారు. అందుకు బదులుగా మంచు మనోజ్ భైరవం ఈవెంట్ లో మాట్లాడుతూ.. కట్టు బట్టలతో రోడ్డు మీదకు వచ్చానన్నారు. కట్టె కాలేవరకు తాను మోహన్ బాబు కొడుకునేనని అన్నారు.

అంతే కాకుండా శివయ్య అంటే శివయ్య రాడని, ఇలాంటి అభిమానులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల రూపంలోనే శివయ్య వస్తాడని సెటైర్లు వేశారు. ఆ తర్వాత అలా అన్నందుకు క్షమాపణలు కూడా చెప్పారు. మంచు లక్ష్మి ఈ గొడవ గురించి ఎప్పుడు స్పందించకపోయినా.. మనోజ్ కి మాత్రం పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నారా అనే రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అయితే ఒక ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి మాట్లాడుతూ కన్నప్ప సినిమా గురించి, తన పర్సనల్ విషయాల గురించి ఓపెన్ అయ్యారు. ఈ సినిమా కోసం దాదాపు పది సంవత్సరాలు నుంచి విష్ణు కష్టపడుతున్నారని చెప్పారు. కన్నప్ప సినిమాలో ఎందుకు నటించలేదు అనే ప్రశ్న ఎదురైంది. అందుకు బదులిస్తూ.. నన్ను ఎందుకు ఈ సినిమాలో తీసుకోలేదో మీరు విష్ణుని అడగాలి అంటూ సమాధానం ఇచ్చారు. నేను నటిస్తే ఈ సినిమాలో నటించిన వారు ఎవరు కనిపించరని సరదాగా వ్యాఖ్యానించారు.
తాను చేయగలిగే పాత్ర లేకపోవడంతోనే విష్ణు తనకు ఆ సినిమాలో అవకాశం ఇవ్వలేదని తెలిపారు. మేమంతా కలిసి సినిమాలో నటిస్తే అది ఫ్యామిలీ సినిమా అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. అలానే తన మద్దతు తన వాళ్లకు ఎప్పుడూ ఉంటుంది అంటూ స్పష్టం చేశారు. దీంతో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

మంచు విష్ణు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో "కన్నప్ప" చిత్రంలో నటిస్తూ, నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీలో రుద్ర అనే పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్.. బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి సహా పలువురు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
అలానే మనోజ్ కూడా ఇటీవల భైరవం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్లీ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇచ్చారు. మంచు లక్ష్మీ సైతం ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న ఈమె బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications