ఎయిర్ ఇండియా ఫ్లైట్ లోనే మంచు లక్ష్మి.. ఎలా తప్పించుకుందో తెలుసా..?
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయిన ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 229 మంది ప్రయాణికులు.. 12 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన యావత్ భారత్ నే కాకుండా ప్రపంచ దేశాలను షాక్ కు గురిచేసింది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని బీజీ వైద్య కళాశాల భవనంపై పడటంతో మరో 24 మంది వైద్య విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో భారత్ కు చెందిన 169 మంది ప్రయాణికులు మృతి చెందగా.. బ్రిటన్ కు చెందిన 53 మంది.. పోర్చుగీసుకు చెందిన ఏడుగురు.. కెనడాకు చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇక 625 అడుగుల ఎత్తులోంచి ఒక్కసారిగా విమానం కుప్ప కూలిపోవడంతో 265 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. దీంతో ఎవర్నీ గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఒకే ఒక్కడు

అయితే ఈ ఘటనపై టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగిన రోజే ఎయిర్ ఇండియా విమానంలో తాను కూడా లండన్ వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. దేవుడి దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డానని తెలిపారు. ఎయిర్ ఇండియా విమానంలోనే మంచు లక్ష్మి లండన్ బయల్దేరారు అన్న వార్త బయటకు రావడంతో మంచు అభిమానులు పెద్ద ఎత్తున మెసేజ్ లు పెడుతూ ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో మంచు లక్ష్మి క్లారిటీ ఇచ్చారు. తాను వేరే ఎయిర్ ఇండియా విమానంలో లండన్ వెళ్లానని.. దేవుడి దయ వల్ల బతికిపోయామంటూ పోస్టు పెట్టారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. ఆమె పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
దేవుడి దయ వల్ల క్షేమంగా బయటపడ్డా: మంచు లక్ష్మి
— ChotaNews App (@ChotaNewsApp) June 14, 2025
విమాన ప్రమాదం జరిగిన రోజే ఎయిర్ ఇండియా ఫ్లైట్లో తాను ప్రయాణించానని చెప్పారు. కానీ, తాను ముంబై నుంచి లండన్ వెళ్లినట్లు చెప్పారు. చాలామంది తనకు ఏమైనా ప్రమాదం జరిగిందా అనే ఆందోళనతో కాల్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. దేవుడి దయ వల్ల… pic.twitter.com/I6z0TZcCqo
దేవుడి దయ వల్ల క్షేమంగా బయటపడ్డానని నటి మంచు లక్ష్మి తెలిపారు. విమాన ప్రమాదం జరిగిన రోజే ఎయిర్ ఇండియా విమానంలో తాను ప్రయాణించానని చెప్పారు. కానీ, తాను ముంబై నుంచి లండన్ వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. చాలామంది తనకు ఏమైనా ప్రమాదం జరిగిందా అనే ఆందోళనతో కాల్స్ చేస్తున్నారని తెలిపారు. దేవుడి దయ వల్ల తాను క్షేమంగా ఉన్నానంటూ ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications