తండ్రైన మంచు మనోజ్..ఇక్కడే అసలు ట్విస్ట్
హీరో మంచు మనోజ్ తండ్రయ్యారు.మంచు మనోజ్ భార్య భూమా మౌనిక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మి తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇప్పుడు మేం నలుగురు అయ్యాం. దేవుళ్ల ఆశీర్వాదంతో దేవత వచ్చింది. మేమిద్దరం ఎంతగానో ఎదురు చూస్తున్న బేబీ వచ్చేసింది.అన్న అయినందుకు ధైరవ్ ఆనందానికి అవధుల్లేవు. ఆమెను (మనోజ్, మౌనిక) మేము ముద్దుగా ఎంఎం పులి అని పిలస్తున్నాము.
మా కుటుంబంపై ఆ శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని భావిస్తున్నాను. వారిని ఆశీర్వదించండి' అంటూ మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ను షేర్ చేసింది. మనోజ్‌కు పాప పుట్టడంతో మంచు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై మంచు కుటుంబం నుంచి ఇంకా ఎవరూ స్పందించలేదు. ఇదిలా ఉంటే భూమా మౌనికను మంచు మనోజ్ గతేడాది వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం.

మనోజ్ రెండో వివాహం అనంతరం మంచు ఫ్యామిలీలో విభేదాలు చోటు చేసుకున్నాయి.ఈ వివాహానికి మనోజ్ అన్నయ్య మంచు విష్ణు దూరంగా ఉన్నారు. మనోజ్ రెండో వివాహం జరిగిన కొద్ది రోజులకే ఆయన ఇంటిపై మంచు విష్ణు దాడి చేసిన వీడియో అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఈ వివాదంపై మంచు ఫ్యామిలీ నుంచి ఎవరూ కూడా స్పందించింది లేదు.
మంచు మనోజ్ ఇటీవల మీడియాతో మాట్లాడిన సమయంలో కూడా అన్నతో విభేదాలు గురించి మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు.దీంతో మంచు ఫ్యామిలీలో విభేదాలు నిజమే అని అంతా భావించారు. రెండో పెళ్లి అనంతరం మళ్లీ సినిమాల్లో యాక్టివ్ కావాలని మంచు మనోజ్ ప్రయత్నిస్తున్నారు. దాదాపు ఏడేళ్ల తరువాత ''వాట్ ది ఫిష్'' అనే సినిమాతో మంచు మనోజ్ హీరోగా రీఎంట్రీ ఇస్తున్నారు.
వరుణ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచియం అవుతున్నారు. ''వాట్ ది ఫిష్''లో పలువురు సినీ ప్రముఖులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మెగా డాటర్ నిహారిక హీరోయిన్‌గా నటిస్తోంది. మనోజ్ - నిహారిక చాలా గ్యాప్ తరువాత నటిస్తున్న చిత్రం కావడంతో 'వాట్ ది ఫిష్'పై అంచనాలు ఏర్పడ్డాయి.ఈ ఏడాదే వాట్ ది ఫిష్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications