Manchu Manoj : తండ్రి కాబోతున్న మంచు మనోజ్..కావాలనే అన్న విష్ణు పేరు చెప్పలేదా..?
మంచు అభిమానులకు మంచు మనోజ్ శుభవార్త అందించారు. తాను తండ్రి కాబోతున్నట్టు ప్రకటించారాయన. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దివంగత భూమా నాగిరెడ్డి-శోభా నాగిరెడ్డి , మోహన్ బాబు- నిర్మల మరోసారి గ్రాండ్ పేరెంట్స్ కాబోతున్నారని ప్రకటించారు. మీ ప్రేమ ,ఆప్యాయతలు ఎప్పుడూ మాతోనే ఉండాలని తన ట్విట్‌లో రాసుకొచ్చారు. మనోజ్ చేసిన ఈ ట్విట్‌లో ఎక్కడా కూడా తన అన్న విష్ణు గురించి ప్రస్తావించలేదు.
ఇదిలా ఉంటే భూమా మౌనికను మంచు మనోజ్ గతేడాది వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం. మనోజ్ రెండో వివాహం అనంతరం మంచు ఫ్యామిలీలో విభేదాలు చోటు చేసుకున్నాయి.ఈ వివాహానికి మనోజ్ అన్నయ్య మంచు విష్ణు దూరంగా ఉన్నారు. మనోజ్ రెండో వివాహం జరిగిన కొద్ది రోజులకే ఆయన ఇంటిపై మంచు విష్ణు దాడి చేసిన వీడియో అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది.

ఈ వివాదంపై మంచు ఫ్యామిలీ నుంచి ఎవరూ కూడా స్పందించింది లేదు. మంచు మనోజ్ ఇటీవల మీడియాతో మాట్లాడిన సమయంలో కూడా అన్నతో విభేదాలు గురించి మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు. దీంతో మంచు ఫ్యామిలీలో విభేదాలు నిజమే అని అంతా భావించారు.
ఇక ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో మనోజ్ భార్య భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. నంద్యాల నుంచి పోటీ చేయడానికి మౌనిక ఆసక్తి కనబరుస్తున్నారు. భార్య తరుఫున ప్రచారం చేయడానికి మంచు మనోజ్ సిద్ధంగా ఉన్నారు. భూమా ఫ్యామిలీ ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. మనోజ్ దంపతులకు సోషల్ మీడియా ద్వారా పలువురు కంగ్రాట్స్ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications