'కన్నప్ప' టీజర్ రిలీజ్..ప్రభాస్ లుక్ అదిరింది..ఇదేదో బాగానే ఉండేలా ఉందే..!
మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ , నటిస్తోన్న సినిమా 'కన్నప్ప'. సుమారు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విష్ణు.. తిన్నడు పాత్ర పోషించారు. ఈ సినిమా షూటింగ్ అధిక భాగం న్యూజిలాండ్‌లో జరిగింది. కన్నప్ప భక్తి చిత్రం మాత్రమే కాదని, అదొక చరిత్ర అని మంచు విష్ణు తెలిపారు.ఈ సినిమా టీజర్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రదర్శితమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఇందులో అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.
కాజల్, మోహన్ బాబు, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.ఇటీవలే సినిమాలోని ప్రభాస్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.తొలుత ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆ పాత్రను బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పోషించారు. ప్రభాస్ ఈ సినిమాలో రుద్ర అనే పాత్రలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు. ప్రళయ కాల రుద్రుడు! త్రికాల మార్గదర్శకుడు !! శివాజ్క్షా పరిపాలకుడు!!! అంటూ ప్రభాస్ పోస్టర్‌ను 'కన్నప్ప' యూనిట్ విడుదల చేశారు.అయితే ప్రభాస్ లుక్ ఆశించిన స్థాయిలో లేదని విమర్శలు వినిపించాయి.

తాజాగా ఈ సినిమా నుంచి మరో టీజర్ వచ్చింది.టీజర్ చూస్తుంటే విజువల్ వండర్‌గా ఈ మూవీ రికార్డు క్రియోట్ చేయడం పక్కా అనిపిస్తోంది.స్టోరీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. టీజర్ చివర్లో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. గతంలో ప్రభాస్ లుక్ బాలేదని విమర్శించిన వారి నోర్లు మూయించారు మంచు విష్ణు. టీజర్ చూసిన ఫ్యాన్స్ సినిమా పక్కా హిట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.గతంలో సినిమాపై ట్రోల్స్ చేసిన వారి సైతం 'కన్నప్ప' హిట్ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ పార్వతి పాత్రలో కనిపించనున్నారు.












Click it and Unblock the Notifications