మంచు విష్ణు కొడుకు సినీ ఎంట్రీ.. ఎమోషనల్ అయిన తండ్రి..
నటుడు మంచు విష్ణు కన్నప్ప సినిమాతో బిజి బిజిగా ఉన్నాడు. అయితే, ఈ సినిమా కోసం ఆయన చాలారోజుల నుంచి కృషి చేస్తున్నారు. భారీ బడ్జెట్ మూవీ తో తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్‌నందరినీ తీసుకున్నారు. అయితే, ఇదే సినిమాతో విష్ణు కొడుకు కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారం కన్నప్ప నుంచి ఓ పోస్టర్ విడుదలయ్యింది. అది ఎవరిదో కాదు. మంచు విష్ణు కొడుకు అవ్రమ్ మంచు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అవ్రమ్ తిన్నడు పాత్రలో కనిపించనున్నాడు. ఈ తిన్నడే పెద్దయ్యాక భక్త కన్నప్పగా మారనున్నాడు. అయితే, కొడుకు సినీ ఎంట్రీపై మంచు విష్ణు ఎమోషనల్ అయ్యాడు.
ఈ సందర్భంగా మంచు విష్ణు సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. కన్నప్ప సినిమాలోని అవ్రమ్ లుక్‌ను లాంచ్ చేశారు. ఈ పోస్టర్‌ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈ ప్రపంచానికి తను నటుడిగా పరిచయం అవుతున్నందుకు నాకు మాటలు రావడం లేదు అని ఎమోషన్‌ల్ అయ్యాడు. ఇక, కన్నప్ప సినిమా గురించి చూస్తే... ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన గతంలో మహాభారత్' సిరీస్‌కు దర్శకత్వం వహించారు.

ఇది ఒక పాన్ ఇండియా సినిమా. ఈ సినిమాలో మంచు విష్ణు కన్నప్ప రోల్ ప్లే చేస్తున్నాడు. కన్నప్పలో మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్ , దేవరాజ్ వంటి పెద్ద పెద్ద స్టార్స్ందరూ నటిస్తున్నారు. ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ మళయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదల కానుంది.












Click it and Unblock the Notifications