కంటెంట్ ఉంటే తొక్కడం ఎవరి వల్ల కాదు బాసూ..రూ. 150 కోట్ల క్లబ్‌లో చిన్న సినిమా
కంటెంట్ ఉంటే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం అని నిరూపించిన మరో అద్భుతమైన చిత్రం 'మండాడి'. టాలెంటెడ్ యాక్టర్స్ సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి మతిమారన్ పుగళేంది తన అద్భుతమైన టేకింగ్‌తో ప్రాణం పోశారు.
బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులు
తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్లా ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. ఏపీ, తెలంగాణలో ప్రముఖ పంపిణీ సంస్థ 'మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి' ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా రిలీజ్ చేసింది. విడుదలైన తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ లెక్కలను తిరగరాస్తోంది. తమిళనాడులో ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేయగా.. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. సూరి, సుహాస్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలవడం విశేషం.
భుజాలపై మోసిన సూరి, సుహాస్
సినిమాను తమ భుజాలపై మోశారు సూరి, సుహాస్. వీరిద్దరి నటన, స్క్రీన్ ప్రెజెన్స్, పాత్రల్లో ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. వీరికి తోడుగా మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తమ అద్భుతమైన నటనతో సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు. 'మండాడి' సినిమాకు ప్రధాన బలం అందులోని యాక్షన్ సీక్వెన్సులు,సాంకేతిక విలువలు. ముఖ్యంగా సినిమాలో వచ్చే బోట్ సీక్వెన్స్, రేసింగ్ సీన్స్ ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. కథిర్ అందించిన కళ్లు చెదిరే విజువల్స్, దానికి తోడు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ సమకూర్చిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచుతాయి.
హాలీవుడ్ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్













Click it and Unblock the Notifications
