ఈ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ బాసూ

ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'మండాడి'. మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో రూపొందిన ఈ కంటెంట్ రిచ్ మూవీని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి సెప్టెంబర్ 10న ఏపీ, తెలంగాణల్లో గ్రాండ్‌గా విడుదల చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుండటంతో, శనివారం చిత్రబృందం యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌ను ఘనంగా నిర్వహించింది.

తెలుగులోకి 'హనుమాన్ అంశ్'.. సెప్టెంబర్ 18 న గ్రాండ్ రిలీజ్.. త్రివిక్రమ్ మ్యాజిక్..
తెలుగులోకి 'హనుమాన్ అంశ్'.. సెప్టెంబర్ 18 న గ్రాండ్ రిలీజ్.. త్రివిక్రమ్ మ్యాజిక్..

హీరో సూరి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేసిన తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా థాంక్స్. మైత్రి నవీన్, రవి విడుదల ముందే ఈ సక్సెస్‌ని అంచనా వేశారు. తమిళంతో పాటు తెలుగులోనూ వస్తున్న ఈ ఆదరణ మరిన్ని మంచి సినిమాలు చేయడానికి స్ఫూర్తినిస్తోంది. హీరో సుహాస్ మాట్లాడుతూ..'మా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. సూరి అన్నతో వర్క్ చేయడం గొప్ప అనుభవం. సినిమాపై నమ్మకంతో ముందుకొచ్చిన మైత్రి టీమ్‌కి, మమ్మల్ని ఆదరిస్తున్న మీడియా , ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు." తెలిపారు

Mandaadi Movie Blockbuster Celebrations Soori Suhas Thank Telugu Audience in AP and Telangana

ఎనిమిది నెలల క్రితం బిజినెస్ కట్ చూసినప్పుడే ఈ సినిమా సత్తా ఏంటో మాకు అర్థమైంది. మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ పెరగడం విశేషం. కంటెంట్‌నే నమ్ముకుని తీసిన చిత్రం ఇది. గతంలో 'రంగం' సినిమాకు ఎలాంటి ఆదరణ దక్కిందో, ఇప్పుడు 'మండాడి'కి కూడా అంతే గొప్ప రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా బోట్ సీక్వెన్స్, సూరి, సుహాస్‌ల నటనకు థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని నిర్మాతలైన మైత్రి నవీన్ ,రవి వెల్లడించారు.

AK47 TEASER: వెంకటేశ్ 'ఆదర్శ కుటుంబం' టీజర్ రిలీజ్.. త్రివిక్రమ్ రఫ్పాడించాడు భయ్యో..!
AK47 TEASER: వెంకటేశ్ 'ఆదర్శ కుటుంబం' టీజర్ రిలీజ్.. త్రివిక్రమ్ రఫ్పాడించాడు భయ్యో..!

దర్శకుడు మదిమారన్ సినిమా సక్సెస్‌ గురించి రియాక్ట్ అవుతూ..మంచి సినిమాకు సరిహద్దులు ఉండవని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు.మూడో రోజుకే దాదాపు 100 స్క్రీన్లను అదనంగా పెంచాం. డిస్ట్రిబ్యూటర్లందరూ చాలా ఆనందంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. బాక్సాఫీస్ వద్ద హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న 'మండాడి' రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+