బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న చిన్న సినిమా .. 4 రోజుల్లోనే రూ. 65 కోట్ల రచ్చ
ఎల్రెడ్ కుమార్ సమర్పణలో, ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై దర్శకుడు మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన తాజా చిత్రం 'మండాడి'. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, రెండు భాషల్లోనూ రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ మూవీ 65 కోట్లకు పైగా గ్రాస్ సాధించి, సూరి , సుహాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
సూరి, సుహాస్ ఇద్దరూ తమ నటనతో సినిమాను ముందుండి నడిపించారు. వీరికి తోడుగా సత్యరాజ్, మహిమా నంబియార్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తమ పాత్రల్లో ఒదిగిపోయి కథకు కావాల్సిన బలాన్ని అందించారు. నిమాలో వచ్చే బోట్ రేసింగ్, సముద్రపు నేపథ్యంలోని యాక్షన్ సీన్లు ప్రేక్షకులకు రోమాంచిత అనుభూతిని అందిస్తున్నాయి. పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ అందించిన ఫైట్ కొరియోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

కథిర్ అందించిన విజువల్స్ పక్కా మాస్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయగా, జీవీ ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం రతీ సీన్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. సూపర్‌స్టార్ రజినీకాంత్, దిగ్గజ దర్శకుడు వెట్రిమారన్ వంటి సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాను వీక్షించి మేకర్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం మున్ముందు ఈ చిత్రం మరిన్ని కలెక్షన్ల రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications
