ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..?
ఇండస్ట్రీలో ప్రతి నటుడూ ఒక మంచి పాత్ర కోసం వేచి చూస్తుంటాడు. హీరోలుగా అవ్వాలని ఇండస్ట్రీలోకి వచ్చిన చాలామంది.. మొదట చిన్న చిన్న విలన్, కామెడీ పాత్రలతో మెప్పిస్తుంటారు. ఆ తర్వాత సరైన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తుంటారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తవారిలో చాలా మంది ఇలా గుర్తింపు తెచ్చుకున్న వాళ్లే.. అయితే ఇటీవల కమెడియన్లుగా మంచి గుర్తింపు తెచ్చుకుని హీరోలుగా మారిన సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'మండాడి'.. ఈ మూవీ సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 140 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో తీరప్రాంత పడవల పోటీలు, మత్స్య కారుల జీవితం, భావోద్వేగాలను ప్రధానంగా హైలెట్ అయ్యాయి. మండాడి చిత్రానికి మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు.
ఈ మూవీని ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ పై ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీలో సూరి- సుహాస్ లతోపాటు మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రల్లో నటించారు. ఇక టాలీవుడ్ యంగ్ యాక్టర్ సుహాస్ ఈ చిత్రం ద్వారా తమిళ సినీ రంగ ప్రవేశం చేయడమే కాకుండా నెగెటివ్ పాత్రలో తన నటనతో ప్రశంసలు అందుకోవడం విశేషం. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. అలాగే ఎస్. ఆర్. కథిర్ సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు. అయితే తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ మూవీ రెండు చోట్లా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.

మండాడి సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫారమ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మండాడి సినిమా వచ్చే నెల అక్టోబర్ 8 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక థియేటర్లలో ఈ సినిమాను చూడటం మిస్ అయిన ప్రేక్షకులు.. అక్టోబర్ రెండో వారం నుంచి ఓటీటీలో చూసే అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు.












Click it and Unblock the Notifications
