ఇరగదీసిన టీజర్.. ఈ సినిమా పక్కా హిట్ బాసూ రాసిపెట్టుకోండి..!
యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సుహాస్, కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సూరి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'మండాడి'. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో, 'ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్' బ్యానర్‌పై మతిమారన్ పుగళేంది ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 10న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పవర్‌ఫుల్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
అంచనాలు పెంచేసిన పవర్‌ఫుల్ టీజర్
సముద్రం, పడవల పందెం నేపథ్యంలో సాగే రసవత్తర పోరాట ఘట్టాలతో టీజర్ అత్యంత ఆకట్టుకునేలా సాగింది. పందెమే మనల్ని కాపాడుతుంది.. పందెాన్ని మనం కాపాడటం లేదు, బరిలోకి దిగే ప్లేయర్స్‌లో నిజాయితీ ఉంటే.. ఈ గాలి, సముద్రం మిమ్మల్ని ఎప్పటికీ ఒగ్గేయదు అంటూ సాగిన సంభాషణలు సినిమాలోని ఎమోషన్‌ను, ఇంటెన్సిటీని తెలియజేస్తున్నాయి. సముద్రంలో చిత్రీకరించిన బోట్ రేసింగ్ సీన్స్, యాక్షన్ సీక్వెన్సులు విజువల్ వండర్‌గా ఉన్నాయి. సుహాస్, సూరిల పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నెక్ట్స్ లెవెల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ , ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ చేతిలో
తెలుగునాట తిరుగులేని క్రేజ్ ఉన్న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యంత భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'మండాడి' సినిమాపై ఈ టీజర్‌తో అంచనాలు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి.














Click it and Unblock the Notifications