బిగ్ బాస్ చరిత్రలో తొలి కంటెస్టెంట్‌గా నిలిచిన మణికంఠ
తెలుగు బిగ్ బాస్ 8వ సీజన్ దిగ్విజయంగా ఏడు వారాలను పూర్తి చేసుకుంది. ఈ ఏడు వారాల్లో బిగ్ బాస్ హౌస్‌లో ఎన్నో మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. ఈసారి కంటెస్టెంట్లగా యష్మీ గౌడ ,నిఖిల్ అభియ్ నవీన్ , ప్రేరణ , ఆదిత్య ఓం , నైనికా ,సోనియా ఆకుల,బెజవాడ బేబక్క, ఆర్‌జే శేఖర్ భాషా , సీత, నాగ మణికంఠ,పృద్వీరాజ్, విష్ణు ప్రియ బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు. వీరిలో బెజవాడ బేబక్క,శేఖర్ భాషా , అభినవ్ , సోనియా ఆకుల,ఆదిత్య ఓం,నైనికా ,సీత, మణికంఠ ఎలిమినేషన్ అయి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు.
ఇక గతంలో ఎప్పుడు లేనివిధంగా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.ఐదో వారమే బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎనిమిది మంది వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు.మెహబూబ్, హరితేజ, నాయని పావని, ముక్కు అవినాష్, గౌతమ్ కృష్ణ, రోహిణి, గంగవ్వ, టేస్టీ తేజ వంటి పాత కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లో అడుగుపెట్టారు. పాత, కొత్త కంటెస్టెంట్లతో గేమ్ మరింత రసవత్తరంగా మారింది.

ఇక చివరి వారం ఎలిమినేషన్‌లో భాగంగా మణికంఠ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. అయితే ఏడో వారం హౌస్ నుంచి బయటకు రావడానికి హరితేజ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీరాజ్, గౌతమ్ కృష్ణ, యష్మి గౌడ, నబీల్ అఫ్రిది, టేస్టీ తేజా, నాగ మణికంఠ మొత్తం తొమ్మిది మంది నామినేషన్ అయ్యారు. వీరిలో ఎవరికి తక్కువ ఓట్లు పోల్ అయితే వారు హౌస్ నుంచి బయటకు వస్తారు. ఈ వారం టేస్టీ తేజ లేదా పృథ్వీ ఎలిమినేట్ అవుతారని అంతా భావించారు. వీరికే అతి తక్కువ ఓట్లు పోల్ అయ్యాయని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగింది. అయితే అనూహ్యంగా మణికంఠ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు.
బిగ్ బాస్ ఇంటి నుంచి ఎవరు ఎలిమినేట్ అయిన వారి AVని తప్పకుండా స్టేజ్ పై ప్లే చేస్తారు. కానీ, ఆదివారం ఎపిసోడ్ లో మణికంఠ AVని మాత్రం ప్లే చేయలేదు. ఇది ప్రేక్షకులకు అర్ధం కానీ ప్రశ్న లా మారింది. ఒక వేళ రీ ఎంట్రీ ఏం అయిన ప్లాన్ చేశారా అంటే.. అది కూడా స్పష్టత లేదు. మరి, అందరీ AVలు ప్లే చేసి ఇతనిది ప్లే చేయకపోవడానికి కారణం ఏంటో తెలియడం లేదు. ఓటింగ్ లెక్కల ప్రకారం మణికంఠ సేఫ్ అవ్వడంతో అతని AV ని ప్రిపేర్ చేసి ఉండకపోవచ్చని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications