2024లో ఇంతమంది సెలిబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్నారా..?

2024వ సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని రోజుల్లో 2025 మొదలుకాబోతుంది. ఈ సమయంలో 2024లో చాలానే మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నుంచి ఒలింపిక్స్ వరకు, ఐపీఎల్ నుంచి వరల్డ్ కప్ వరకు ఇలా అనేక రకాల సంఘటనలు ఈ 2024లో చోటు చేసుకున్నాయి. అలాగే ఎంతో మంది ఈ సంవత్సరం సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. అలాగే 2024లో కొందరు సెలబ్రిటీలు వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. ఆ లిస్ట్‌ను ఓసారి పరిశీలిస్తే..

డిసెంబర్ 4వ తేదీన అక్కినేని నాగచైతన్య -శోభితా ధూళిపాళ ఒక్కటయ్యారు. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య శోభిత ధూళిపాళతో రిలేషన్ మెయిన్‌టైన్ చేశాడు.రెండేళ్లు డేటింగ్ అనంతరం శోభితను వివాహం చేసుకున్నాడు. మహానటి కీర్తి సురేష్‌ సైతం ఈ ఏడాది వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఆంటోని తట్టిల్‌ను కీర్తి సురేష్ డిసెంబర్ 12వ తేదీన వివాహం చేసుకుంది.

many celebrities got married in 2024

విలన్ క్యారెక్టర్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బరాజు స్రవంతి అనే అమ్మాయిని నవంబర్ 28న పెళ్లాడాడు.సెప్టెంబర్ 16వ తేదీన హీరో సిద్ధార్థ్ అదితీరావు హైదరీతో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ శ్రీకాంత్ కిదాంబి శ్రావ్య వర్మతో నవంబర్ 9న ఏడడుగులు వేశారు.ఆగష్టు 22వ తేదీన కిరణ్ అబ్బవరం - రహస్య గోరఖ్‌లు ఒక్కటయ్యారు.జూన్ 2వ తేదీన టీమిండియా బ్యాట్స్‌మెన్ వెంకటేష్ అయ్యర్ శ్రుతి రఘునాథన్‌కు మూడుముళ్లు వేశాడు.

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా జూన్ 23న జహీర్ ఇక్బల్‌ను పెళ్లాడింది.జూలై 12వ తేదీ అపరకుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా మర్చంట్‌ను పెళ్లి చేసుకున్నాడు. మార్చి 15వ తేదీన నటి కృతి కర్బంద పులకిత్ సామ్రాట్‌ను మనువాడింది. ఫిబ్రవరి 21వ తేదీన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ బిజినెస్ మ్యాన్ జాకీ భగ్నానీని పెళ్లాడింది బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సైతం ఈ ఏడాదే పెళ్లి పీటలు ఎక్కనుంది. వెంకట దత్త సాయిని డిసెంబర్‌ 22న పీవీ సింధు వివాహం చేసుకోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+