దసరా స్పెషల్ షోలో మాస్ మహారాజా రవితేజ...
మాస్ మహారాజా రవితేజ త్వరలోనే టైగర్ నాగేశ్వర రావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది. వంశీ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. 1970 -80 దశకంలో తెలుగు రాష్ట్రాలను గడగడలాడించిన స్టూవర్ట్‌పురానికి చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తీసున్న చిత్రమిది. అయితే తాజాగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దసరా స్పెషల్ షోలో రవితేజ ప్రేక్షకులను అలరించనున్నారు.
ప్రతి ఏటా దసరా సందర్భంగా ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్ జీ తెలుగు కొత్త కొత్త ప్రోగ్రామ్‌లను ప్రేక్షకులకు అందిస్తుంది. అయితే ఈసారి కూడా స్పెషల్ ప్రోగ్రామ్స్ తో అభిమానులను అలంరించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ప్రతి ఏటా నిర్వహించే దసరా కలిసుందాంరా స్పెషల్ ఈవెంట్ ఈసారి కూడా జరగనుంది.

ఈ షోలో మాస్ మహారాజా రవితేజ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారు. ఈ దసరా కలిసుందాంరా ప్రోగ్రామ్ అక్టోబర్ 22 సాయంత్రం 6 గంటల నుంచి జీతెలుగులో ప్రసారం కానుంది. ఈ వేడుకల్లో భాగంగా టాలీవుడ్ స్టార్లతో కలిసి బుల్లితెర నటీనటులు కలిసి అభిమానులకు వినోదాలు పంచనున్నారు.

ప్రముఖ హీరోయిన్లు కూడా: ఈ షోలో నటుడు రవితేజతో పాటు ప్రముఖ హీరోయిన్లు కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. వాళ్లలో కొందరితో రవితేజ ప్రత్యేకంగా మాట్లాడనున్నట్లు సమాచారం. అయితే ఈ వేడుకలో నటి జయప్రద, రాశి, సంఘవి, ప్రేమ, యమున, ఆమని వంటి నటీమణులు కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక జీ తెలుగు ఛానెల్లో వచ్చే సీరియల్స్ లోని ఫిమేల్ క్యారెక్టర్లు కూడా ఇం దులో పాల్గొననున్నట్లు సమాచారం.
పాత సినిమాల్లోని పాటలకు ఈ నటీమణులంతా కలిసి స్టెప్పులేయనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్, టీవీ నటీమణులు అందరూ కలిసి అంత్యాక్షరి వంటి పోటీలు కూడా పెట్టుకుంటున్నారు. అయితే, మాస్ మహారాజా నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం ఈ నెల అంటే అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications