హీరోయిన్‌పై స్టింగ్ ఆపరేషన్‌..ఇలా దొరికిపోయిందేంటి..!

ఇప్పుడైతే హీరో , హీరోయిన్ల ఎఫైర్ల గురించి ఈజీగా తెలిసిపోతుంది. దీనికి తోడు ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఉండటంతో సెలబ్రిటీలు ఏం చేసిన క్షణాల్లోనే సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతోంది. కానీ గతంలో సెలబ్రిటీల గురించి ఏదైన తెలుసుకోవాలంటే పెద్ద పెద్ద స్టింగ్ ఆపరేషన్లు చేయాల్సి వచ్చేది. ఓ స్టార్ హీరోయిన్ రోజులో నాలుగైదు గంటలు కనిపించకుండా పోయేదట. ముఖ్యంగా రాత్రి సమయంలో ఆ హీరోయిన్ ఓ బంగ్లాకు వెళ్లేదట. ఈ విషయం తెలుసుకున్న మీడియా ఆ హీరోయిన్ ఆ నాలుగైదు గంటలు ఎక్కడకు వెళ్తోంది, ఏం చేస్తోందో అని తెలుసుకోవాలని ఆమెపై ఓ స్టింగ్ ఆపరేషన్‌ చేశారట.

మీడియా ప్రతినిధులు స్టింగ్ ఆపరేషన్‌ చేసిన హీరోయిన్ మరెవ్వరో కాదు నమిత. తమిళ ఇండస్ట్రీలో నమితకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కెరీర్ స్టార్టింగ్‌లో సన్నని మల్లెపూవు మాదిరిగా ఉండేది నమిత. తమిళ స్టార్ హీరోలందరితోనూ ఈ భామ సినిమాలు చేసింది. దీంతో తమిళంలో నమితకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఎంతలా అంటే అభిమానులు ఆమెకు గుడి కట్టే అంతలా నమితను అభిమానించేవారు. అయితే కెరీర్ స్టార్టింగ్‌లో నమిత షూటింగ్ గ్యాప్ దొరికితే నాలుగైదు గంటలు ఎవరికి కనిపించకుండా ఎక్కడికో వెళ్లేవారట. ముఖ్యంగా రాత్రి సమయంలో ఆమె ఓ బంగ్లాకు వెళ్లేవారట. ఈ విషయం తెలుసుకున్న మీడియా ఆమెపై నిఘా పెట్టారట.

media conducted a sting operation on the heroine

అయితే ఆ బంగ్లాలో నమిత ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని విశ్వప్రయత్నాలు చేశారు. తీరా ఏం తెలిసిందంటే..నమిత ఆ బంగ్లాలో సల్సా డ్యాన్స్ నేర్చుకుంటుందని తేలింది. నమితకు సల్సా డ్యాన్స్ అంటే పిచ్చి.. దాన్ని నేర్చుకోవడానికే ఆమె షూటింగ్ గ్యాప్‌లో ఆ బంగ్లాకు వెళ్లేవారని తెలిసింది. బంగ్లాలో ఉన్న ఓ టీచర్ దగ్గర సల్సా డ్యాన్స్ నేర్చుకునేదట. దీనిపై పలు పత్రికల్లో కథనాలు కూడా వెలిశాయి. ఇక నమిత కెరీర్ విషయానికి వస్తే.. కొన్ని సినిమాలకే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నమిత లావు అవ్వడంతో ఆమె ఫ్యాన్స్ బాగా హార్ట్ అయ్యారు. లావుగా మారడంతో ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయి. సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో నమిత పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+