గురూజీ చేతిలో పడితే అంతే ..!
మీనాక్షి చౌదరి .. ఒకే ఒక సినిమాతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది ఈ భామ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ , మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్‌గా చేసిన కూడా ఈ సినిమా ఆమెకు ఫుల్ పాపులారిటీ తెచ్చి పెట్టింది. మీనాక్షి చౌదరి తెలుగులో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోంది.

మీనాక్షి చౌదరికి మరో బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఈ భామకు లేటెస్ట్‌గా చిరంజీవి సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి దేవకన్యలా కనిపించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

దీంతో పాటు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది ఈ హాట్ బ్యూటీ. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దళపతి విజయ్ నటిస్తున్న సినిమాలో కూడా మీనాక్షి చౌదరినే హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం అందుతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా మీనాక్షి చౌదరి ఫాలోయింగ్ ఒక్కసారిగా మారిపోయింది.
సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య మిలియన్ల సంఖ్యలో ఉంది. తాజాగా ఈ భామ బికినితో దర్శనం ఇచ్చి అభిమానులకు షాకిచ్చింది. బికినితో అందాల విందు చేసింది. గ్లామర్ తళుకులతో అభిమానులను మెస్మరైజ్ చేసింది.ఎద అందాలను ప్రదర్శిస్తూ రెచ్చిపోయింది. . దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. గురూజీ చేతిలో పడితే ఏ హీరోయిన్ దశ అయినా మారిపోతుందని కామెంట్లు చేస్తున్నారు.
-
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications