హీరోయిన్లను సెలెక్ట్ చేయాలంటే గురూజీ తర్వాతే..!

మీనాక్షి చౌదరి .. ఒకే ఒక సినిమాతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది ఈ భామ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ , మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన 'గుంటూరు కారం' సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. 'గుంటూరు కారం' సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేసిన కూడా ఈ సినిమా ఆమెకు ఫుల్ పాపులారిటీ తెచ్చి పెట్టింది. సినిమాలో ఆమెకు పెద్దగా ప్రాధాన్యత కూడా ఏమీ ఉండదు.

అయినప్పటికీ ఈ సినిమాతోనే మీనాక్షి చౌదరి లైఫ్‌లైన్‌లోకి వచ్చిందని చెప్పాలి. మీనాక్షి చౌదరి ప్రస్తుతం తెలుగు,తమిళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తోంది. మీనాక్షి చౌదరికి మరో బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఈ భామకు లేటెస్ట్‌గా చిరంజీవి సినిమాలో నటించే అవకాశం దక్కింది. చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో 'విశ్వంభర' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి దేవకన్యలా కనిపించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న 'మట్కా', హీరో వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీలో కూడా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది.

Meenakshi Chaudhary yellow saree Stills viral

దీపావళి సందర్భంగా ఈ భామ నటించిన 'లక్కీ భాస్కర్' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌లో కనిపించి మెప్పించింది. త్రివిక్రమ్ రికమండ్ చేయడంతోనే 'లక్కీ భాస్కర్'సినిమాలో ఆఫర్ దక్కిందనే విషయం ఇటీవలే బయటకొచ్చింది. ఇక సోషల్ మీడియాలో కూడా అమ్మడు ఫాలోయింగ్ ఒక్కసారిగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య మిలియన్ల సంఖ్యలో ఉంది. తాజాగా ఈ భామ తన గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. ఎల్లో కలర్ శారీతో దర్శనం ఇచ్చి అభిమానులకు షాకిచ్చింది.

గ్లామ‌ర్ త‌ళుకుల‌తో అభిమానులను మెస్మ‌రైజ్ చేసింది. కళ్లతోనే మత్తేక్కిస్తూ స్టైలిష్ లుక్‌లో ఫొటోలకి పోజులిచ్చింది. ముఖ్యంగా ఎద అందాలు హైలెట్ అయ్యేలా ఇచ్చిన ఫోజుల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. మీనాక్షి చౌదరి ఫొటోలపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.నేరుగా స్వర్గం నుండి దిగిపడ్డ దేవకన్యాలా ఉన్నావ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. గురూజీ చేతిలో పడితే ఏ హీరోయిన్ దశ అయినా మారిపోతుందని కామెంట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+