మహేష్‌బాబుకు సమానమైన హీరో లేడు: నాగబాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. పాన్ వరల్డ్ సినిమాగా ఇది రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వంచర్ గా రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మెగా బ్రదర నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం మహేష్ బాబుకు సమానమైన హీరో లేరు అని వ్యాఖ్యానించారు.
అమ్మాయిలకు కలల రాకుమారుడు
మహిళల్లో ప్రిన్స్ కు ఉన్నంత ఆదరణ మరెవరికీ లేదన్నారు. అమ్మాయిలకు సూపర్ స్టార్ కలల రాకుమారుడని అభివర్ణించారు. హ్యాండ్సమ్ విషయంలో తనకు తిరుగులేదని, అతన్ని ఇష్టపడని మహిళలంటూ ఎవరూ ఉండరన్నారు. కుటుంబ సమేతంగా తన సినిమాలను అందర చూస్తారని, తన సతీమణి మహేష్ బాబును తమ్ముడిలా భావిస్తుందన్నారు. ఒక నటుడిగా మహేష్ బాబుకు అనేక ప్లస్ పాయింట్లు ఉన్నాయని, వంద అడ్వాంటేజ్ లు ఉన్నాయన్నారు.

చూస్తుండగాన మారిపోయాడు
వ్యాపారంలో కూడా సూపర్ స్టార్ రాణించడం అభినందనీయమని, చిన్నతనంలో చూడటానికి కొంచెం బొద్దుగా ఉండేవాడని, తనను తాను మార్చుకోవడానికి, తన లుక్ ను సన్నగా, స్లిమ్ గా చేసుకోవడానికి కేబీఆర్ పార్క్ లో రన్నింగ్ విపరీతంగా చేసేవాడని నాగబాబు చెప్పారు. చూస్తూ చూస్తూఉండగానే ఎంతో స్లిమ్ గా మారిపోయి హ్యాండ్సమ్ అయ్యాడని కొనియాడారు. దక్షిణాదిలో సూపర్ స్టార్ గా ఉన్న మహేష్ బాబుకు సమానమైన క్రేజ్ ఉన్న హీరో ఒక్కరేనని, అతను పవన్ కల్యాణ్ అని చెప్పారు. మహేష్ బాబు, పవన్ కల్యాణ్ క్రేజ్ ఇద్దరిదీ ఒకటే అన్నారు.
హాలీవుడ్ లోనే నెంబర్ వన్ అవుతాడు
మెగా బ్రదర్ నాగబాబు తమ హీరో మహేష్ బాబును పొగడటంపై ప్రిన్స్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్ అయిపోతాడని, హాలీవుడ్ సినిమాల్లోనే నెంబర్ వన్ అవుతాడంటూ కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications