ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పబోతున్న నిహారిక.. కంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్

మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. ఎందుకంటే ఆమె ఇప్పటికే సినీ పరిశ్రమలోని వివిధ విభాగాలద్వారా తనలోని టాలెంట్ ను బయటపెడుతోంది. ముందుగా తెలుగు, తమిళంలో నటిగా పరిచయం అయిందికానీ అనుకున్నంతరీతిలో విజయం సాధించలేకపోయింది. తర్వాత జొన్నలగడ్డ చైతన్యతో వివాహం జరిగింది. కొన్నాళ్లకే వీరిద్దరూ మనస్పర్థల వల్ల విడాకులు తీసుకున్నారు. ఇందులో తప్పెవరది అనే విషయం మాత్రం ఇంతవరకు బయటకు లేదు. నిహారికతోపాటు చైతన్య కూడా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ పోస్ట్ లు పెడుతుంటారు.

కమిటీ కుర్రోళ్లతో అందరిచేత శభాష్ అనిపించుకుంది
నటిగా విజయం సాధించకపోయినప్పటికీ నిర్మాతగా మాత్రం విజయం సాధిస్తోంది. ఇప్పటికే పలు సిరీస్ లు నిర్మించింది. తర్వాత కమిటీ కుర్రోళ్లు సినిమా తీసి అందరిచేత శభాష్ అనిపించుకుంది. ఈ సినిమాకు అవార్డు కూడా అందుకుంది. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిహారిక శుభవార్త చెప్పింది. తన స్నేహితురాలు అంబటి భార్గవితో కలిసి మరో కొత్త ప్రయోగం చేయబోతున్నట్లు తెలిపింది. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలను చెబుతానంటూ పోస్ట్ పెట్టింది. నిహారిక స్నేహితులు వెతిక, మహాతల్లి కూడా శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేశారు. దీంతో ఆ ప్రయోగం ఏమిటా అని తెలుసుకునేందుకు మెగా అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

mega daughter Niharika is finally about to tell good news

నచ్చిన వ్యక్తిని త్వరగా వ పెళ్లి చేసుకోవాలి
నిహారిక విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణం నాగబాబు అని చాలామంది విమర్శించారు. కూతురు కాబట్టి ఎంతో గారాబంగా పెంచారని, ఆ గారాబంతో తనకు ఏ షయం గట్టిగా చెప్పలేకపోతున్నారని, కానీ గారాబం గారాబమే.. కొన్ని విషయాల్లో మాత్రం కఠినంగా వ్యవహరించాల్సిందేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వరుణ్ తేజ్ - వణ్య త్రిపాఠి జంట ఎంత చక్కగా కాపురం చేసుకుంటున్నారో చూడండి అంటున్నారు. వారిని ఆదర్శంగా తీసుకొనైనా తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలని, తనకు నచ్చిన వ్యక్తిని త్వరగా వివాహం చేసుకొని జీవితంలో నిహారిక స్థిరపడాలని మెగా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+