మ్యాడ్ హీరోతో మెగా డాటర్ నిహారిక మూవీ.. కానీ అలా కాదు !
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనస్సు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించినా అవి కూడా మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఇకియా విడాకుల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం పలు సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తూనే నిర్మాతగా కూడా సత్తా చాటుతోంది.వాళ్ల విడాకులతో నాకు సంబంధం లేదు.. ఇదే ఫైనల్ వార్నింగ్ !
గతేడాది 'కమిటీ కుర్రోళ్లు' చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు లేటెస్టుగా నిహారిక తన సొంత ప్రొడక్షన్ లో మరో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టింది. 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' చిత్రాలతో ఆడియన్స్ ను అలరించిన సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదెల నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కనున్నట్టు అనౌన్స్ చేసింది. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించనున్నట్టు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

ఈ మేరకు ఆ పోస్టులో.. ''కొత్త ప్రాజెక్ట్. కొత్త కథ. సినిమా మీద అదే ప్రేమ. తర్వాత ఏమవుతుందో తెలుసుకోవడానికి వేచి ఉండండి. ఆలోగా మీరు ఈ జోనర్ ను గెస్ చేయగలరా? రాసుకొచ్చారు. అలానే నిహారిక, సంగీత శోభన్, దర్శకురాలు మానస కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. 2021లో 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' అనే సిరీస్ లో లీడ్ రోల్ లో నటించాడు. అఆ సిరీస్ కి మానస శర్మ దర్శకత్వం వహించగా.. నిహారిక నిర్మించింది. జీ5లో వచ్చిన ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు వీరి కాంబోలో మూవీ రాబోతుండడం పట్ల మంచి అంచనాలు నెలకున్నాయి.
'వర్షం' డైరెక్టర్ శోభన్ చిన్న కొడుకుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు సంగీత్ శోభన్. చైల్డ్ ఆర్టిస్టుగా గోల్కొండ హైస్కూల్ చిత్రంలో నటించి మెప్పించాడు. ఆ తర్వాత 'జకాస్' 'పిట్ట కథలు' 'ది బేకర్ అండ్ ది బ్యూటీ' వంటి వెబ్ సిరీస్ లలో కీలక పాత్రల్లో కనిపించాడు. ఇక 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' చిత్రాలలో తన నటనతో ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోగలిగారు.
New project. New story. Same love for cinema. Stay tuned for what’s next !🔥
— Pink Elephant Pictures (@PinkElephant_P) April 2, 2025
Can you guess the genre though?#PEP2@IamNiharikaK #SangeethShobhan #ManasaSharma #MaheshUppala @manyam73 @PinkElephant_P @Ticket_Factory @beyondmediapres pic.twitter.com/bZuPCbl9ON
మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. మూడు రోజుల్లోనే రూ. 50 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా 4 రోజుల్లో రూ. 69.4 కోట్లు కలెక్ట్ చేసినట్లుగా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.
-
తెలంగాణ గద్దర్ అవార్డుకు ఎంపికైన తొలి బయోపిక్ ఇదే.. స్పెషాలిటీ అదే !! -
అనుష్క పెళ్లి ట్విస్ట్: ఆ విషయాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
'బెడ్ రూమ్ లో నా భర్త చేసేది ఇదీ'.. రాజ్ నిడిమోరుపై సమంత వైరల్ పోస్ట్.. -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
రామ్ చరణ్ 'పెద్ది'లో క్రేజీ ఐటమ్ సాంగ్.. ముగ్గురు స్టార్ హీరోయిన్లతో మాస్ స్టెప్పులు -
చిరంజీవి కూతురుగా బ్లాక్ బస్టర్ మూవీ హీరోయిన్.. ఎవరంటే..? -
'జబర్దస్త్' యాంకర్ ఛాన్స్ వదులుకున్న నటి ఎవరో తెలుసా? అనసూయ స్థానంలో.. -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే!












Click it and Unblock the Notifications