అల్లు అర్జున్‌కు లైన్ క్లియర్ చేసిన మెగా ఫ్యామిలీ
గత కొద్దికాలంగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ సాగుతున్న సంగతి తెలిసిందే. పైకి అంతా బాగానే కనిపించినప్పటికీ లోలోపల మాత్రం అంతర్యుద్ధం సాగుతోంది. తెలియకుండానే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' సినిమాను మెగా హీరోల ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. ఈ సినిమా ఎలా హిట్ అవుతుందో చూస్తామంటూ మెగా అభిమానులు సవాల్ విసురుతున్నారు. వారికి ధీటుగానే అల్లు అర్జున్ అభిమానులు కౌంటరిస్తున్నారు.
ఇదే సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా 'పుష్ప-2'కి పోటీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేయడంతో అభిమానుల మధ్య మరింత చిచ్చు రేపినట్టు అయింది. పుష్ప-2 డిసెంబర్ 6న విడుదల చేస్తోన్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. క్రిస్మస్ కానుకగా గేమ్ ఛేంజర్ విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు తొలుత ప్రకటించారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, 'గేమ్ ఛేంజర్' సినిమాను సంక్రాంతికి వాయిదా వేస్తున్నట్టు దిల్ రాజు తెలిపారు.

'గేమ్ ఛేంజర్' సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించడంతో పాటు దసరా సందర్భంగా డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. 2025 జనవరి 10వ తేదీన 'గేమ్ ఛేంజర్' సినిమాను విడుదల చేయబోతున్నారు. విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' సినిమా సైతం వాయిదా పడింది. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సంక్రాంతికి వస్తుండటంతో 'విశ్వంభర' సినిమాను వాయిదా వేయస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో అల్లు అర్జున్ 'పుష్ప-2'కు ఎటువంటి అడ్డంకులు లేకుండ పోయాయి.
పుష్ప మొదటి పార్ట్ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. బన్నీ తన మ్యానరిజంతో, యాక్టింగ్‌తో పుష్పను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టేశాడు. నార్త్ ఆడియెన్స్‌కు పుష్ప బాగా ఎక్కేసింది. అందుకే పుష్ప అక్కడ వంద కోట్లు కొల్లగొట్టేసింది. దీంతో 'పుష్ప-2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం నార్త్ ఆడియెన్స్ ఎంతో అతృతుగా ఎదురు చూస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే సుకుమార్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది. 90 శాతానికి పైగా సినిమా పూర్తి అయినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 6న ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఇప్పుడు మెగా హీరోలు సైతం డిసెంబర్ నుంచి తప్పుకోవడంతో అల్లు అర్జున్‌కు పోటీనే లేకుండాపోయింది. డిసెంబర్ మొత్తం కూడా పుష్ప తన ప్రతాపం చూపించనున్నాడు.












Click it and Unblock the Notifications