డిసెంబర్ 5న 'పుష్ప-2'కి పోటీగా మెగా హీరో సినిమా రిలీజ్
సినీ యావత్తు మొత్తం కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 సినిమా కోసం అతృతుగా ఎదురు చూస్తోంది. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మొదటి పార్ట్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నార్త్ ఆడియోన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాకు గానూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ హీరో అవార్డు సైతం గెలుచుకున్నారు.జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచారు.
risk, reward & gamble - MATKA Vasu is the ringmaster who rules them all 👑#MatkaOnPrime, December 5 pic.twitter.com/Djsux1H6nJ
— prime video IN (@PrimeVideoIN) November 30, 2024
బన్నీ తన మ్యానరిజంతో, యాక్టింగ్‌తో పుష్పను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టేశాడు. నార్త్ ఆడియెన్స్‌కు పుష్ప బాగా ఎక్కేసింది. అందుకే పుష్ప అక్కడ వంద కోట్లు కొల్లగొట్టేసింది. దీంతో 'పుష్ప-2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం నార్త్ ఆడియెన్స్ ఎంతో అతృతుగా ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ చిత్ర ట్రైలర్ కట్ కూడా ఉండటంతో ఈ మూవీ కోసం నేషన్‌వైడ్‌గా అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. దీంతో 'పుష్ప-2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే సరిగ్గా ఇదే రోజు మెగా హీరో సినిమా కూడా విడుదల కానుంది. మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల నటించిన చిత్రం 'మాట్కా'.

పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'మట్కా' భారీ అంచనాల మధ్య నవంబర్ 14న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే 2024 లోనే భారీ డిజాస్టర్ ఈ మూవీనే అని సినీ పండితులు తేల్చేశారు. మెగా హీరోలు సైతం ఈ సినిమా వైపు కన్నెత్తి చూడలేదు. ఫలితంగా వరుణ్ తేజ్ కెరీర్‌లోనే ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. విడుదలైన 20 రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా, ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అయితే డిసెంబర్ 05 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications