డైరెక్టర్ బుచ్చిబాబుకి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన మెగా పవర్ స్టార్..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' సినిమాలో నటిస్తున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు. సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఫుల్ గా జుట్టు, గడ్డంతో చరణ్ రా అండ్ రస్టిక్ లుక్ లో అదరగొట్టారు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
వచ్చే ఏడాదిలో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా 1980 ల నాటి స్పోర్ట్స్ నేపథ్యంలో సిద్ధమవుతోందని టాక్ వినిపిస్తోంది. అయితే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబుకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. వాటితో పాటు ఒక లెటర్ కూడా రాసుకొచ్చారు. ఆ లేఖలో.. డియర్ బుచ్చి నేను 40లోకి అడుగు పెట్టిన సందర్భంగా.. నా జీవితంలో నాతో పాటుగా ఎల్లప్పుడూ ఉండే కొంత మందికి ప్రత్యేకంగా బహుమతుల్ని పంపించాలని అనుకున్నాను.. నువ్వు కూడా అలా నా కుటుంబ సభ్యుల్లో ఒకరివి అని రాసుకొచ్చారు. నువ్వు మా జీవితంలోకి రావడం నాకు ఎంతో ఆనందం, అందుకే నీకు ప్రత్యేకంగా గిఫ్ట్స్ పంపిస్తున్నానని తెలిపారు.

ఓ కస్టమ్ ట్రావెల్ కిట్‌ను పెట్టాం.. నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా.. నీతో పాటుగా మేం ఉంటున్నాం అని గుర్తు చేస్తాయి.. హనుమాన్ విగ్రహాన్ని పంపిస్తున్నాను. అలానే హనుమాన్ చాలీసా తనకు జీవితంలో అత్యంత గొప్ప శక్తిని ఇచ్చిందని.. కష్ట సమయాల్లో హనుమాన్ పై నమ్మకం తనను నిలబెట్టిందని అన్నారు. ఆ శక్తిలో కొంత నీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నా జీవితంలో నీకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. నువ్వు ఎప్పుడూ బాగుండాలని.. దేవుడి దీవెనలు నీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఇది కేవలం గిఫ్ట్ మాత్రమే కాదు. నీ మీద మాకున్న ప్రేమను చాటుతుంది అని లేఖలో పేర్కొన్నారు. అలానే జై శ్రీరామ్ అని రాసిన పాదాలు సహా పలు గిఫ్ట్స్ ఉన్నాయి.
ఇక ఈ గిఫ్ట్‌లను చూసి బుచ్చిబాబు సైతం తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. థాంక్యూ సో మచ్ సర్.. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను.. మీరెప్పుడూ నన్ను ఇన్ స్పైర్ చేస్తుంటారు. మీరు ఎంతో గ్రౌండెడ్‌గా ఉంటారని బుచ్చిబాబు రాసుకొచ్చాడు.
Tqqq very much dear @AlwaysRamCharan Sir nd @upasanakonidela garu for the wonderful gift 🤍
— BuchiBabuSana (@BuchiBabuSana) April 4, 2025
Indebted to ur love nd support 🙏🏼
May the blessings of Lord Hanuman be with you nd give more strength nd power to you Sir...
Your values r truly inspiring nd always remind us to stay… pic.twitter.com/1pt1k01zkz












Click it and Unblock the Notifications